మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మంది రుణాలు తీసుకుంటున్నారు. ప్రైవేటు బ్యాంకులు అందుబాటులోకి రావడం, బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో చాలా సులభంగా రుణాలు అందిస్తున్నారు. దీంతో చాలా మందికి సులభంగా రుణాలు వస్తున్నాయి. ఒకప్పటిలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా స్మార్ట్ ఫోన్‌లో యాప్‌లో ఒక చిన్న క్లిక్‌తో అకౌంట్‌లోకి డబ్బులు వచ్చి పడుతున్న రోజులివీ. ఇక క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మరింత సులువుగా మారింది.
ఎక్కడో కార్డు స్వైప్ చేసి దానిని ఈఎమ్‌ఐగా మార్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అసలు చాలా మందికి తమ పేరు మీద ఎన్ని రుణాలు ఉన్నాయన్న విషయం కూడా తెలియని వారు ఉన్నారు. ఇక ఇటీవల పెరిగిన సైబర్ నేరాల నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు మనకు తెలియకుండానే మన పేరుపై రుణాలు తీసుకుంటున్నారు. ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్‌ను దొంగతనంగా సేకరించి అడ్డుదారిలో లోన్స్ తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అసలు మన పేరు మీద ఎన్ని లోన్స్ ఉన్నాయి.? ప్రస్తుతం అవి ఏ స్టేజ్‌లో ఉన్నాయి.? లాంటి వివరాలు ఎలా తెలుసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇందుకోసం ఓ విధానం అందుబాటులో ఉంది. సిబిల్ వెబ్‌సైట్‌లో ఈ విషయాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ దగ్గర కచ్చితంగా పాన్ కార్డ్ ఉండాలి. పాన్ నెంబర్ ఆధారంగా మీ లోన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. మీ పేరుపై ఎన్ని లోన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి..
* ఇందుకోసం ముందుగా www.cibil.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అనంతరం గెట్ యువర్ సిబిల్ స్కోర్ అనే సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* అనంతరం పాస్‌వార్డ్‌ను క్రియేట్ చేసుకుఒని. పాన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* వెంటనే మీ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయానే మీ సిబిల్ స్కోర్ వస్తుంది. దీంతో పాటు మీ పేరుపై ఏయే బ్యాంకుల్లో ఎంత రుణం ఉంది.? ఎన్ని ఈఎమ్‌ఐలు పూర్తి అయ్యాయి. లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..