సొంతిళ్లు ప్రతీ ఒక్కరి కల. జీవితంలో మనకంటూ ఓ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అందుకోసమే ప్రయత్నం చేస్తుంటారు. ఇక బ్యాంకులు సైతం తక్కు వడ్డీతో హోం లోన్స్ ఇస్తున్నాయి. ఎక్కువ టెన్యూర్‌ను అందుబాటులోకి తీసుకొస్తూ హోమ్ లోన్స్‌ను ఈజీగా చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు.
దీంతో చాలా మంది హోమ్ లోన్స్ తీసుకొని సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో హోం లోన్ భారంగా మారే అవకాశం ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉండడం ఈఎమ్‌ఐ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే కొన్ని ఆర్థిక చిట్కాలు పాటిస్తే హోమ్ లోన్స్ భారాన్ని తగ్గించుకోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..
* హోమ్ లోన్ తీసుకునే ముందే అన్ని బ్యాంకులను సంప్రదించడం ఉత్తమం. అన్నింటికంటే తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకులోనే హోమ్ లోన్ తీసుకోవాలి.
* ఇక లోన్ రీపేమెంట్ టెన్యూర్‌ను ఎక్కువగా పెట్టుకునేం ఈఎమ్ఐ భారం తగ్గించుకోవచ్చు. తక్కువ టెన్యూర్ ఉంటే చెల్లించాల్సిన ఈఎమ్‌ఐ ఎక్కువగా ఉంటుంది. అదే టెన్యూర్ ఎక్కువగా ఉంటే.. భారం తగ్గుతుంది. అయితే టెన్యూర్ పెరిగితే వడ్డీ కూడా పెరుగుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
* ఇదిలా ఉంటే మీరు హోమ్ తీసుకోవాలనుకునే ప్లాన్‌లో ఉంటే.. ముందు నుంచే మీ క్రెడిట్ స్కోర్ బాగుండేలా చూసుకోవాలి. సిబిల్ స్కోర్ బాగుంటే వడ్డీ రేటు తగ్గుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వడ్డీ రేటు తగ్గితే ఆటోమెటిక్‌గా ఈఎమ్‌ఐ భారం కూడా తగ్గుతుంది.
* టెన్యూర్ ఉన్నన్ని రోజులు కాకుండా మీ దగ్గర డబ్బు ఉంటే ముందుగానే లోన్‌ను చెల్లించడం ఉత్తమం. దీంతో ఈఎమ్‌ఐ భారంతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది. అయితే ప్రీ క్లోజర్ ఛార్జీలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
* హోమ్ లోన్ తీసుకునే ముందు వీలైతే డౌన్ పేమెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. డౌన్‌పేమెంట్ ఎక్కువగా ఉంటే.. హోమ్ లోన్ భారం తగ్గుతుంది.
* కొన్ని బ్యాంకులు తమ బ్యాంకుల వార్షికోత్సం లేదా పండుగల సందర్భంగా హోమ్ లోన్స్‌పై భారీగా ఆఫర్లను ప్రకటిస్తాయి. సాధారణ రోజుల కంటే ఈ సమయాల్లో తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో హోమ్ లోన్స్ తీసుకోవడం వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
* ఒక బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నంత మాత్రాన మొత్తం అందే బ్యాంకులో చెల్లించాలనే నిబంధన ఏం లేదు. ఇతర బ్యాంకులు ఒకవేళ ఇతర బ్యాంకులు తక్కువ వడ్డీకీ రుణం అందిస్తుంటే మీ లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కూడా ఏఎమ్‌ఐ భారాన్ని తగ్గించుకోవచ్చు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..