సిమ్ కార్డు నుంచి ఫ్లైట్ టికెట్ వరకు ఆధార్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. ప్రభుత్వ పథకాలు మొదలు బ్యాంకు పని వరకు ఆధార్ లేనిది పని జరగని పరిస్థితి. దీంతో ప్రతీ ఒక్కరూ ఆధార్‌ను అనివార్యంగా తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఆధార్ కార్డ్‌లో అప్‌డేషన్ విషయంలో ఎప్పుడూ సందేహాలు ఉండే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డు ఉన్న చాలా మంది అందులో తమ ఫొటో విషయంలో అసంతృప్తిగా ఉంటారు. దీనికి కారణం ఎప్పుడో దిగిన ఫొటో కావడం అందులోనూ క్లారిటీగా ఉండకపోవడం.
ఆధార్ కార్డు సేవలు ప్రారంభమైన రోజుల్లో కెమెరాలను అంత నాణ్యమైనవి లేకపోవడంతో ఫొటోలు అంత క్లారిటీ రాలేవు. దీంతో ఆ పాత ఫొటోలనే ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఫొటోను మార్చుకునే అవకాశం లేదా అంటే.. దానికి ఓ ప్రాసెస్ ఉంది. ఇంతకి ఆధార్ కార్డులో ఫొటోను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ uidao.gov.inలోకి వెళ్లాలి.
* అనంతరం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌ను ఓపెన్ చేయండి.
* ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు దగ్గరల్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లండి.
* అనంతరం అక్కడే ఉండే నిర్వహకులు మీ వివరాలను బయోమెట్రిక్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు.
* అనంతరం అక్కడి నిర్వాహకులు తమ వెబ్ కెమెరా ద్వారా కొత్త ఫొటోను తీసుకుంటారు.
* ఇందుకోసం యూజర్ల నుంచి రూ. 100ని వసూలు చేస్తారు.
* ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత అక్‌నాలెడ్జ్ స్లిప్‌ను అందిస్తారు.
* అనంతరం నిర్ణీత సమయం తర్వాత ఫొటో మారిన ఆధార్ కార్డ్ పోస్ట్ కార్డు ద్వారా మీ అడ్రస్‌కు వస్తుంది. లేదంటే ఆన్‌లైన్‌లో ఈ ఆధార్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..