Jobs for Women: మహిళలకు శుభవార్త.. 2024 నాటికి 50% ఉద్యోగాలు మహిళలకు ఇస్తామన్న ఆ కంపెనీ..

|

Mar 20, 2022 | 12:41 PM

Jobs for Women: ఇప్పుడు మహిళలకు ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. తమ మెుత్తం ఉద్యోగుల్లో మహిళల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో భారత దిగ్గజ కంపెనీ నిలిచింది.

Jobs for Women: మహిళలకు శుభవార్త.. 2024 నాటికి 50% ఉద్యోగాలు మహిళలకు ఇస్తామన్న ఆ కంపెనీ..
Jobs For Women
Follow us on

Jobs for Women: ఇప్పుడు మహిళలకు ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. తమ మెుత్తం ఉద్యోగుల్లో మహిళల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కొన్ని కంపెనీలు క్రమేపీ మహిళా ఉద్యోగుల సంఖ్యను(Women employees ratio) పెంచుతూ.. వారి కోసం కొంత శాతం ఉద్యోగాలను పక్కకు పెడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇది ఒక ట్రెండ్ గా మారింది. ఇదే బాటలో ఎఫ్ఎమ్సీజీ దిగ్గజమైన బ్రిటానియా ఇండస్ట్రీస్(Britannia Industries) కూడా పయనిస్తోంది. 2024 నాటికి కంపెనీ ఉద్యోగుల్లో 50 శాతం మహిళలు ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ఈ నెల 16న ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీలో మహిళా ఉద్యోగుల నిష్పత్తి 38 శాతంగా ఉందని చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషి వెల్లడించారు. లింగ భేదాన్ని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

గువహటి లోని బ్రిటానియా ఫ్యాక్టరీలో మహిళా ఉద్యోగుల నిష్పత్తి 60 శాతంగా ఉందని.. రానున్న కాలంలో దీనిని 65 శాతానికి పెంచాలని కంపెనీ యోచిస్తోందని వెల్లడించారు. మహిళా సాధికారత(Women Empowerment) కోసం కంపెనీ ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలతో స్టార్టప్ ఛాలెంజ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న.. 30 మంది మహిళలకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున ఇందుకోసం సీడ్ క్యాపిటల్ అందించినట్లు చెప్పారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేందుకు గూగుల్ సంస్థతో జతకట్టి వారికి స్కిల్ ట్రైనింగ్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

Defence Imports: భారత రక్షణ దిగుమతుల్లో రష్యాదే అగ్రస్థానం.. కానీ ఇప్పుడు సీన్ మారుతోందా..!

Billionaires: బిలియనీర్లలో భారత్ మూడో స్థానం.. ధనవంతుల్లో ఎక్కువ మంది ఆ నగరాల్లోని వారే..!