Budget 2024: గృహ నిర్మాణానికి రూ. 2.2లక్షల కోట్లు.. వచ్చే ఐదేళ్లకు టార్గెట్ ఇదే..

|

Jul 23, 2024 | 1:19 PM

PM Awas Yojana: కేంద్ర బడ్జెట్ 2024 ప్రసంగాన్ని చేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అర్బన్ హౌసింగ్ కోసం ఏకంగా రూ. 2.2లక్షల కోట్ల ప్రోత్సాహాన్ని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లకు ఈ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకాన్ని విస్తరిస్తూ.. మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వివరించారు. 

Budget 2024: గృహ నిర్మాణానికి రూ. 2.2లక్షల కోట్లు.. వచ్చే ఐదేళ్లకు టార్గెట్ ఇదే..
Housing
Follow us on

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రవేశపెట్టిన పీఎం అవాస్ యోజనకు మోదీ 3.0 ప్రభుత్వం బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. వచ్చే ఐదేళ్లకు టార్గెట్ ను ఫిక్స్ చేసింది. మంగళవారం కేంద్ర బడ్జెట్ 2024 ప్రసంగాన్ని చేస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అర్బన్ హౌసింగ్ కోసం ఏకంగా రూ. 2.2లక్షల కోట్ల ప్రోత్సాహాన్ని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లకు ఈ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకాన్ని విస్తరిస్తూ.. మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వివరించారు. అంతేకాక రానున్న కాలంలో మొత్తం రూ. 10లక్షల కోట్లతో పట్టణాల్లోని ఒక కోటి పేద, మధ్య తరగతి కుటుంబాల గృహ అవసరాలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అర్బన్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు సరసమైన ధరలకు రుణాలను అందించడానికి వడ్డీ రాయితీ పథకం ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఇంకా, పెరిగిన లభ్యతతో సమర్ధవంతమైన, పారదర్శకమైన అద్దె గృహాల మార్కెట్‌ను రూపొందించడానికి చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వివరించారు.

పీఎం అవాస్ యోజన ఇది..

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం జూన్ 2015లో ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన పట్టణ లబ్ధిదారులందరికీ మౌలిక సదుపాయాలతో కూడిన పక్కా గృహాలను అందిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న తన కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాన్ని మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పీఎంఏఐ కోసం రూ. 80,671 కోట్లు కేటాయించారు. గత అంచనాలలో రూ. 54,103 కోట్లుగా సవరించారు. గత 10 ఏళ్లలో 4.21 కోట్ల ఇళ్లను పూర్తి చేసేందుకు వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గృహాల కొరతను పరిష్కరించడానికి ఈ విస్తరణ చాలా కీలకం కానుంది. భారతదేశంలో స్థిరమైన పట్టణాభివృద్ధికి కీలకమైన సరసమైన గృహాల రంగాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఈ చర్య చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అదే విధంగా 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద నగరాల కోసం రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలను కూడా మంత్రి ప్రతిపాదించారు. రాబోయే ఐదేళ్లలో 100 వీక్లీ హాట్‌ల అభివృద్ధికి మద్దతు ఇచ్చే పథకాన్ని కూడా ప్రతిపాదించారు. అలాగే క్రెడిట్, ఎంఎస్ఎంఎఈ సర్వీస్ డెలివరీకి సంబంధించిన ఏడు రంగాలలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..