Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulses Prices: సామాన్యుల నడ్డి విరుస్తున్న పప్పుల ధరలు.. ఏడాది కాలంలో ఎంత పెరిగాయో తెలుసా..?

ప్రస్తుతం కూరగాయలు, పప్పుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలను సామాన్య ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కూరగాయలు, పప్పులను కొనుగోలు చేయాలంటే భయపడే రోజులు వచ్చాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం దేశ ప్రజలందరి వెన్ను విరిచింది. ఇప్పుడు కూరగాయలు కొనేందుకు కూడా అప్పు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది. సరఫరా లేకపోవడంతో టమాట ధరలు 200 రూపాయలకు మించి..

Pulses Prices: సామాన్యుల నడ్డి విరుస్తున్న పప్పుల ధరలు.. ఏడాది కాలంలో ఎంత పెరిగాయో తెలుసా..?
Flour Pulses
Follow us
Subhash Goud

|

Updated on: Aug 04, 2023 | 3:27 PM

ప్రస్తుతం కూరగాయలు, పప్పుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలను సామాన్య ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కూరగాయలు, పప్పులను కొనుగోలు చేయాలంటే భయపడే రోజులు వచ్చాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం దేశ ప్రజలందరి వెన్ను విరిచింది. ఇప్పుడు కూరగాయలు కొనేందుకు కూడా అప్పు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది. సరఫరా లేకపోవడంతో టమాట ధరలు 200 రూపాయలకు మించి పలుకుతున్నాయి. మరోవైపు, ఇతర వంటగది వస్తువుల ధరలలో విపరీతమైన పెరుగుదల ఉంది. బంగాళదుంపలు మినహా ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

గత ఏడాది కాలంలో పప్పు ధరలు గరిష్టంగా 28 శాతం మేర పెరిగాయని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ వారం పార్లమెంటుకు తెలిపింది. అదే సమయంలో బియ్యం ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. కంది పప్పు, పిండి ఒక సంవత్సరంలో 8 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ఏడాది క్రితం కిలో బియ్యం రూ.37 ఉండగా, గురువారం సగటు చిల్లర ధర రూ.41గా ఉంది.

పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గింది

దేశీయంగా ఉత్పత్తి తగ్గడమే పప్పు ధర పెరగడానికి కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2022-23 పంట సంవత్సరానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముందస్తు అంచనా ప్రకారం.. గత పంట సంవత్సరంలో 42.2 లక్షల టన్నులతో పోలిస్తే 34.3 లక్షల టన్నులు, తొగర్‌ ఉత్పత్తి 34.3 లక్షల టన్నులుగా అంచనా వేశారు అధికారులు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు కౌశిక్ సమాచారం ఇస్తూ, టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల అమ్మకాలు భారీగా తగ్గడంతో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రైస్ మానిటరింగ్ సెల్ ప్రకారం.. కందిపప్పు సగటు రిటైల్ ధర గురువారం కిలోకు రూ.136గా ఉంది. గత ఏడాది కిలో రూ.106.5గా ఉంది. బంగాళాదుంపల సగటు రిటైల్ ధర గత ఏడాదితో పోలిస్తే 12 శాతం తక్కువగా ఉందని, ఉల్లి ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే 5 శాతం ఎక్కువగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

టమోటా ధరలపై మంత్రిత్వ శాఖ ఇటీవలి పంట కాలానుగుణ పరిస్థితి, కోలార్‌లో తెల్లదోమ వ్యాధి, దేశంలోని ఉత్తర ప్రాంతంలో రుతుపవనాల వర్షాలు టమోటా ధరలపై ప్రతికూల ప్రభావానికి దారితీశాయని పేర్కొంది. గత ఏడాది రూ.34గా ఉన్న టమాటా గురువారం సగటు ధర కిలో రూ.140గా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. టమాటా గరిష్ట ధర ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కిలో రూ.257 ఉండగా, ఢిల్లీలో రూ.213, ముంబైలో కిలో రూ.157కు విక్రయిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి