భారతదేశంలో పెట్టుబడిపై స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు మొదటి ఎంపికగా ఉంటున్నాయి. తక్కువ-రిస్క్ ఆప్షన్లను ఇష్టపడే వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రముఖ పెట్టుబడి ఎంపికగా మారాయి. అయితే భారతదేశంలో ఇబ్బడిముబ్బడిగా బ్యాంకులు ఉండడంతో ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ అందిస్తున్నాయో? తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బ్యాంకులు ఎఫ్‌డీలను ప్రోత్సహించాలాని కోరిన విషయం విధితమే ఈ నేపథ్యంలో ఎఫ్‌డీల్లో పెట్టుబడితో ఏయే బ్యాంకులు అధిక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయో? ఓసారి తెలుసుకుందాం.
ఒక సంవత్సరం ఎఫ్‌డీ కోసం ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటును 7.75 శాతం అందిస్తుంది. అంటే మీ రూ. 10,000 పెట్టుబడి రూ.10,798కి పెరుగుతుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ 7.5 శాతం రేటుతో మీ డబ్బును రూ. 10,771కి పెంచుతోంది. బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ రెండూ 7.25 శాతం రేటును అందిస్తాయి. ఫలితంగా రూ. 10,745 మెచ్యూరిటీ సొమ్మును పొందవచ్చు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.1 శాతం రేటును అందిస్తాయి. అంటే దాదాపు మొత్తం రూ. 10,729 పొందవచ్చు.
మీరు రెండు సంవత్సరాల ఎఫ్‌డీను ఎంచుకుంటే ఆర్‌బీఎల్ బ్యాంక్ 8 శాతం వడ్డీ రేటుతో రూ.10,000 డిపాజిట్‌పై రూ.11,717 మెచ్యూరిటీ సొమ్ముగా అందిస్తుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.75 శాతం ఆఫర్ చేయడంతో రూ. 11,659, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, రెండూ 7.5 శాతం ఆఫర్ చేసి మీ పెట్టుబడిని రూ. 11,602కి పెంచుతాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 7.25 శాతం ఆఫర్ చేయడం వల్ల మెచ్యూరిటీ మొత్తం రూ.11,545కి చేరుకుంది.
మూడు సంవత్సరాల ఎఫ్‌డీలపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 7.55 శాతం రేటును అందిస్తుంది. అంటే రూ. 10,000 పెట్టుబడి మెచ్యూరిటీతో రూ. 12,516 అవుతుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ 7.5 శాతం అందించడం వల్ల ఇది మీ పెట్టుబడి రూ.12,497కు పెరుగుతుంది. యస్ బ్యాంక్, ఐడీఎఫ్ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక్కొక్కటి 7.25 శాతం ఆఫర్ చేస్తున్నాయి.
ఐదు సంవత్సరాల ఎఫ్‌డీ విషయానికి వస్తే డీసీబీ బ్యాంక్ 7.4 శాతం అందిస్తుంది. అందువల్ల రూ. 10,000 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సొమ్ము రూ. 14,428కి పెరుగుతుంది. ధనలక్ష్మి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ ఒక్కొక్కటి 7.25 శాతం ఆఫర్ చేస్తున్నాయి. అందవుల్ల మీ పెట్టుబడి రూ.14,323కి పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..