Flipkart Sale: మరో సేల్‌తో వచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. ఏసీలపై భారీ తగ్గింపు.. ఇదే మంచి తరుణం..

ఎయిర్‌కండీషనర్ల ఫ్లిప్‌ కొనుగోలుపై కార్ట్‌ భారీ ఆఫర్లను అందిస్తోంది. 1.5టన్‌ స్ప్లిట్‌ ఏసీలపై పలు ఆఫర్లు ప్రకటించింది. ధరలు రూ. 26,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. సిటీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకు కార్డులపై మరో 10శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది.

Flipkart Sale: మరో సేల్‌తో వచ్చిన ఫ్లిప్‌కార్ట్‌.. ఏసీలపై భారీ తగ్గింపు.. ఇదే మంచి తరుణం..
Air Conditioner

Updated on: May 25, 2023 | 12:56 PM

వేసవి విజృంభిస్తోంది. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సమయంలో అందరూ ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. కొత్త వాటిని కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఓ మంచి ఎయిర్‌ కండీషనర్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు అయితే ఈ కథనం అస్సలు మిస్‌ అవ్వొద్దు. ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌ కార్ట్‌ ఎయిర్‌ కండీషనర్ల విక్రయాలపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. 1.5 టన్‌ ఎయిర్‌ కండీషనర్లు కేవలం రూ. 26,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. పైగా ప్రతి ఏసీ కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్‌ కూడా పలు బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ స్పెషల్‌ సేల్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌ కార్ట్‌ ఎయిర్‌కండీషనర్ల కొనుగోలుపై భారీ ఆఫర్లను అందిస్తోంది. 1.5టన్‌ స్ప్లిట్‌ ఏసీలపై పలు ఆఫర్లు అందిస్తోంది. ఈ ఏసీల ధరలు రూ. 26,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. సిటీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకు కార్డులపై మరో 10శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. ఇది కాకుండా ఏదైనా పాత ఏసీ ఎక్స్‌ చేంజ్‌ చేస్తే గరిష్టంగా రూ. 7000 వరకూ అదనపు డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. తక్కువ ధరకు ఫ్లిప్‌ కార్ట్‌లో లభిస్తున్న పలు ఎయిర్‌ కండీషనర్లను ఇప్పుడు చూద్దాం..

వోల్టాస్ 1.5 టన్ స్ల్పిట్ ఏసీ.. వోల్టాస్ 1.5 టన్‌ స్ల్పిట్ ఏసీపై ఫిప్‌ కార్టులో ఆఫర్‌ఉంది. 3 స్టార్ రేటింగ్‌తో ఉన్న ఈ ఏసీ ధర రూ.32,999గా ఉంది. అయితే ఏదైనా పాత ఏసీ ఎక్స్‌ చేంజ్‌ చేస్తే రూ. 4,500 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఏసీపై ఒక సంవత్సరం మ్యానుఫ్యాక్టరింగ్‌ వారంటీ, 10 సంవత్సరాల కంప్రెషర్‌ వారంటీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్లూ స్టార్ 1.5 టన్‌ స్ల్పిట్ ఏసీ.. ఈ బ్లూ స్టార్ కన్వర్టిబుల్ 5 ఇన్ 1 ఏసీ 1.5 టన్‌ సామర్థ్యంతో వస్తుంది. ఇది కూడా 3 స్టార్ ఏసీనే. దీని ధర రూ.35,490గా ఉంది.అయితే ఏదైనా పాత ఏసీ ఎక్స్‌ చేంజ్‌ చేస్తే రూ. 4,500 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఏసీ కొనుగోలుపై ఒక సంవత్సరం మ్యానుఫ్యాక్టరింగ్‌ వారంటీ, కంప్రెషనర్‌పై పదేళ్ల వారంటీ ఉంటుంది.

వర్ల్‌పూల్ 1.5 టన్ స్ల్పిట్ ఏసీ.. ఈ వర్ల్‌పూల్ కన్వర్టిబుల్ 4 ఇన్ 1 ఏసీ రూ.31,990కి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఇది 1.5 టన్‌ సామర్థ్యంతో 3 స్టార్ రేటింగ్‌ తో వస్తుంది.. ఇందులో 6 సెన్స్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. అయితే ఏదైనా పాత ఏసీ ఎక్స్‌ చేంజ్‌ చేస్తే రూ. 4,500 వరకూ తగ్గింపు లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..