Offers On Ac’s: తెలుగు రాష్ట్రాల్లో దంచికొండుతున్న ఎండలు.. ఏసీలపై కూల్..కూల్ ఆఫర్లు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్
ఎయిర్ కండీషనర్ల అధిక ధర వల్ల మధ్యతరగతి ప్రజలు వాటిని కొనడానికి కొంత ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్‌లపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. దాదాపు 50 శాతం తగ్గింపు ధరతో ఇవి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడం ఆలస్యం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. ప్రజలు వేడిని అధిగమించడానికి సమర్థవంతమైన మార్గాలను వెతుకుతున్నారు. దీంతో ఎయిర్ కండీషనర్‌లకు డిమాండ్ ఏర్పడింది. అయితే ఎయిర్ కండీషనర్ల అధిక ధర వల్ల మధ్యతరగతి ప్రజలు వాటిని కొనడానికి కొంత ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్‌లపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. దాదాపు 50 శాతం తగ్గింపు ధరతో ఇవి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఏసీల కొనుగోలుపై ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తుంది. టాప్ ఏసీలపై వచ్చే ఆఫర్లు ఏంటో సారి తెలుసుకుందాం.
సామ్‌సంగ్ ఏసీలపై ఆఫర్లు ఇలా
సామ్‌సంగ్ కన్వర్టబుల్ 5 ఇన్ వన్ స్ప్లిట్ ఏసీలపై 38 శాతం తగ్గింపు లభిస్తుంది. 1 టన్ను కెపాసిటీ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ అసలు ధర రూ. 51,990 మాత్రమే. అయితే ఈ ఏసీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 31,500కు అందుబాటులో ఉంది. అంతేకాదు ఈ ఏసీపై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా అందిస్తుంది.
లాయిడ్ ఏసీ
లాయిడ్ 1.2 టన్ను 3 స్టార్ ఏసీ ప్రస్తుతం భారీ 43% తగ్గింపుతో వస్తుంది. ఈ ఏసీ అసలు ధర రూ.54,990గా ఉంది. కానీ ఈ ఏసీ ప్రస్తుతం రూ.30,990కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఏసీపై రూ. 4,000 అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
క్యారియర్ ఏసీ
చిన్న గదుల కోసం క్యారియర్ 0.8 టన్నుల 3 స్టార్ స్ప్లిట్ ఏసీ ప్రస్తుతం రూ.25,999కు అందుబాటులో ఉంది. ఈ ఏసీ సాధారణ ధర రూ. 55,690గా ఉంది. అలాగే బ్యాంకు ఆఫర్లు కూడా వర్తిస్తాయి.
ఎల్‌జీ స్ప్లిట్ ఏసీ
ఎల్‌జీ సూపర్ కన్వర్టిబుల్ స్ప్లిట్ ఏసీలపై ఈ సేల్లో భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌జీ సూపర్ కన్వర్టిబుల్ 5-ఇన్-1 కూలింగ్ 2023 మోడల్ 3-స్టార్ రేటింగ్‌తో 1 టన్ను ఏసీ ప్రస్తుతం 43 శాతం ఫ్లాట్ తగ్గింపుతో వస్తుంది. ఈ ఏసీ అసలు ధర రూ.57,990గా ఉంటే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.32,990కు అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..






