
Flipkart Big Billion Days Sale: టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసేస్తున్నారు. వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇప్పుడు పండగ సీజన్‌లు వస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో పండగ సీజన్ మరింతగా ఊపందుకుంటుంది. వినాయక చవితి, దసరా, దీపావళి పండగలు ఉండటంతో ఈకామర్స్ దిగ్గజాలు భారీ ఆఫర్లతో ముందుకు వస్తుంటాయి. ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్ భారీ సెల్‌తో ముందుకు వస్తోంది. అదే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale). త్వరలో ఈ భారీ సేల్ ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్టు తెలిపింది. త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను తీసుకువస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ సేల్‌లో బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మరో రెండు, మూడు రోజుల్లో ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో ఈ బిగ్ సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Flipkart Big Billion Days Sale 2022
ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. ఇవే కాకుండా 40 శాతం నుంచి 80 శాతం వరకు పలు వస్తువులపై భారీ డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ఉండనుంది. స్మార్ట్‌టీవీలు, రిప్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, అలాగే హోమ్ అప్లయెన్సెస్‌పై ఈ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌లు, సౌండ్ బార్లు, బ్లూటూత్, ఇయర్‌బడ్స్‌లపై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించిన తర్వాత ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రం ఒక రోజు ముందుగానే సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్, శాంసంగ్, రియల్‌మి, రెడ్‌మి, ఒప్పో, వీవో వంటి ప్రముఖ బ్రాండ్‌లపై భారీ తగ్గింపు ఉండే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి