UDAN scheme: పేదలకు అందుబాటులో ఆకాశయానం.. ఆ పథకం మరో పదేళ్ల పొడగింపు

|

Oct 22, 2024 | 1:42 PM

విమానంలో ఆకాశమార్గంలో ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలని కోరుకుంటారు. ఆకాశంలో విమానం వెళుతూ ఉంటే దాన్ని చూసి సంబరపడే పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలామంది ఉంటారు. అయితే దాని టిక్కెట్ల ధర ఎక్కువగా ఉండడంతో కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే ప్రయాణించే వీలు కలుగుతుంది. అయితే పేదలకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఉడాన్ (యూఏడీఎన్) అనే పథకాన్ని పదేళ్లు అమలు చేసేలా 2016లో తీసుకువచ్చారు.

UDAN scheme: పేదలకు అందుబాటులో ఆకాశయానం.. ఆ పథకం మరో పదేళ్ల పొడగింపు
Flight Travel
Follow us on

ఉడాన్ పథకం ద్వారా టిక్కెట్ల ధరలు అందుబాటులోకి రావడంతో సామాన్య , పేద వర్గాల ప్రజలు కూడా విమానంలో ప్రయాణించే వీలు కలిగింది.  ఇప్పుడు ఈ పథకాన్ని మరో పదేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడిగిస్తున్నట్టు పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఇటీవల వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రారంభించి ఎనిమిదేళ్లు అయిన సందర్బంగా దేశ రాజధానిలో ఈ విషయం తెలిపారు. దీని ద్వారా ఇప్పటి వరకూ 601 రూట్లు, 71 విమానాశ్రయాలను ప్రారంభించారు. అనేక మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. వివిధ ప్రాంతాలకు పర్యాటకులు కూడా పెరిగారు. 

ఉడాన్ పథకం ద్వారా దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రజల రాకపోకలకు పెరిగాయి. 2047 నాటికి 350 నుంచి 400 వరకూ ఆపరేషనల్ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలన్నదే ఉడాన్ పథకం ప్రధాన లక్ష్యం. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (యూడీఏఎన్) (ఉడాన్) అనే పథకాన్ని తీసుకువచ్చింది.  దేశంలో వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం కూడా దీని మరో లక్ష్యంగా ఉంది.

హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లే తొలి విమానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.  దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య విమానాల రాకపోకలు పెంచడం, పేదలు కూడా విమానాల్లో ప్రయాణం చేసే వీలు కల్పించడం, దేశంలో అభివద్దిలో లేని 425 విమానాశ్రయాలను నిర్వహణలోకి తీసుకురావడం, వేగవంతమైన కనెక్టివీటితో ప్రగతికి బాటలు వేయడం, యువతకు ఉద్యోగవకాశాలు కల్పించడం, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడం ఉడాన్ పథకం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఉడాన్ పథకంలో భాగంగా విమాన ప్రయాణానికి సంబంధించి గంటకు రూ.2500 వసూలు చేస్తారు. ప్రాంతాల మధ్య సంబంధాలు పెరగడానికి ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. అంటే కిలోమీటర్ కు సగటున అయ్యే ఖర్చును రూ.5కి తగ్గించారు. ఉడాన్ పథకంలో భాగంగా ఈశాన్య ప్రాంతాలకు విమాన సర్వీసులను కేంద్ర విమానాయాన సంస్థ పెంచింది. ముఖ్యంగా భారతదేశంలో టూరిజం పెరగడానికి ఉడాన్ పథకం కీలకపాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..