Fixed Deposit: బ్యాంకులు వినియోగదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. బ్యాంకుల డిపాజిట్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) ఒకటి. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేటు లభిస్తుంటుంది. అయితే వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ కొన్ని చిన్న చిన్న, ప్రైవేటు బ్యాంకులు కొత్త కస్టమర్లను ఆకర్షించే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేటు అందిస్తున్నాయి. ఇక సీనియర్ సిటిజన్లు మూడేళ్ల కాల వ్యవధి ఎఫ్‌డీలపై 7 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తున్నాయి. అన్ని బ్యాంకులు కూడా 5 లక్షల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ కింద బీమా అందిస్తున్నాయి. మరో వైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ ఒకే కాలానికి ఎఫ్‌డీలపై 5.80 శాతం వడ్డీ మాత్రమే అందిస్తున్నాయి.
సీనియర్ సిటిజన్లకు మెరుగైన రేట్లు..
ప్రైవేటేరంగ బ్యాంకులలో యస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఉత్తమ వడ్డీ రేటు అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు మూడు సంతవ్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే ఆర్‌బీఎల్ బ్యాంకు రెండో స్థానంలో ఉంది. సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే ప్రైవేటు రంగ బ్యాంకులలో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంకు సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే డీసీబీ బ్యాంకు వృద్ధులకు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.45 శాతం వడ్డీ అందిస్తోంది. మరో వైపు సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఐడీఎఫ్‌సీ బ్యాంకులో మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీని పొందతున్నారు. ఇలాంటి ఫిక్స్ డిపాజిట్ల విషయంలో సీనియర్ సిటిజన్లకు మంచి ఆఫర్లు ఉంటాయి. వారికి ఎక్కువ వడ్డీ రేట్ లభిస్తుండగా, సాధారణ కస్టమర్లకు మరో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి పలు బ్యాంకులు.
ఇవి కూడా చదవండి: