Health Insurance: 5 లక్షల ఆరోగ్య బీమా.. కేవలం 300 రూపాయలలో వచ్చే అవకాశం..!

|

Apr 28, 2022 | 8:31 AM

Health Insurance: పేదరికం ఇకపై శాపం కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో

Health Insurance: 5 లక్షల ఆరోగ్య బీమా.. కేవలం 300 రూపాయలలో వచ్చే అవకాశం..!
Health Insurance
Follow us on

Health Insurance: పేదరికం ఇకపై శాపం కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లేనివారికి తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్‌ అందించే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కవరేజీని 40 కోట్ల కుటుంబాలకు విస్తరించనుంది. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా ప్రజలు అంటే 10.74 కోట్ల కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఉన్నాయి. ఈ పథకం ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వార్షిక ఆరోగ్య రక్షణను ఉచితంగా అందిస్తుంది. వాస్తవానికి రిటైల్ ధర వద్ద ఆరోగ్య బీమాను పొందలేని వారికి తక్కువ ప్రీమియంతో ఈ కవరేజీని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నీతి ఆయోగ్‌తో కలిసి నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ఈ పథకం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకానికి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.1,052 ప్రీమియం చెల్లిస్తోంది. ఇప్పుడు పథకం ప్రయోజనాన్ని పొందడానికి ప్రతి వ్యక్తి రూ. 250 నుంచి రూ. 300 వరకు వార్షిక ప్రీమియం చెల్లించాలి.

5 లక్షల వరకు ఉచిత చికిత్స

ఒక కుటుంబంలో సగటున 5 గురు సభ్యులు ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. దీని ప్రకారం.. ఒక కుటుంబం వార్షిక ప్రీమియం 1200 నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో ప్రతి వ్యక్తికి రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతుంది. నేషనల్ హెల్త్ అథారిటీ పాలక మండలి ఈ నెల ప్రారంభంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించింది. NHA కొన్ని నెలల్లో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఆ తర్వాత ఇది భారతదేశం అంతటా విస్తరిస్తారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్‌టెన్షన్ స్కీములు దిగువన ఉన్న 51% జనాభాకు వైద్య సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇది కాకుండా జనాభాలో 19% మంది అంటే 25 కోట్ల మంది వ్యక్తులు సామాజిక ఆరోగ్య బీమా, ప్రైవేట్ స్వచ్ఛంద ఆరోగ్య బీమా పరిధిలో ఉన్నారు. మిగిలిన 30% జనాభా ఆరోగ్య బీమాకు దూరంగా ఉన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Aadhaar Alert: అక్కడి నుంచి ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేస్తున్నారా జాగ్రత్త..!

PM Kisan: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకి హెచ్చరిక.. ఆ పనిచేస్తే వెంటనే అధికారులని కలవండి..!

IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్‌ కింగ్‌ యుజ్వేంద్ర చాహల్.. టాప్ 3లోకి దూసుకొచ్చిన డ్వేన్‌ బ్రేవో..