
Flight Ticket: విమానం ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటం.. చివరకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పడం వంటి ఘటనలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొసారి గంటలపాటు విమానం ఆలస్యమవుతుంది. దీని వల్ల అత్యవసర ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడతారు. ఇటీవల దేశంలో విమానాలు రద్దు అవుతున్న సంఘటనలు భారీగా పెరిగిపోయాయి. ఇండిగో విమానాలు భారీగా ఇటీవల రద్దు అవుతూ వార్తల్లోకెక్కుతోంది. ఈ తరుణంలో అసలు విమానాలు రద్దు అయితే ప్రయాణికులకు ఎలాంటి హక్కులు ఉంటాయి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు చూద్దాం.
-ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో ముందుగానే ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలి.
-విమానం 2 గంటల కంటే ఎక్కువసేపు ఆలస్యమైతే వసతి, భోజన సౌకర్యం కల్పించాలి.
-ఇక 24 గంటల కంటే ఎక్కువ లేట్ అయితే హోటల్ వసతితో పాటు స్థానికంగా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా కల్పించాలి.
-ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ అందజేయాలి
-ప్రయాణికులు ఫుల్ రీఫండ్ అయినా తీసుకోవచ్చు లేదా ఉచితంగా వేరే విమానంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు
-విమానయాన సంస్థ లగేజీ పొగోడితే పరిహారం అడగవచ్చు
-ఓవర్ బుకింగ్ వల్ల సీటు దొరక్కపోతే రీఫండ్, పరిహారం రెండూ కోరవచ్చు
-విమాన ఆలస్యం, క్యాన్సిల్‌పై సమాచారం పొందే హక్కు ఉంటుది
-7 రోజుల ముందే టికెట్ బుక్ చేసి విమాన ప్రయాణానికి 24 గంటల ముందు రద్దు చేస్తే పూర్తి రీఫండ్ ఇవ్వాలి
-వాతావరణం అనుకూలించకపోవడం, టెక్నికల్ సమస్యల వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయితే పూర్తి రీఫండ్ ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో పరిహారం చెల్లించరు.