5 లక్షల పర్సనల్ లోన్‌కి బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తాయి..! ఎన్ని వాయిదాలు చెల్లించాలి తెలుసుకోండి..

|

Aug 15, 2021 | 6:49 PM

Personal Loan : ఎవరికైనా డబ్బు అత్యవసరమైనపుడు బ్యాంకు లోన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా పర్సనల్ లోన్స్‌పై ఎక్కువగా

5 లక్షల పర్సనల్ లోన్‌కి బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తాయి..! ఎన్ని వాయిదాలు చెల్లించాలి తెలుసుకోండి..
Personal Loan
Follow us on

Personal Loan : ఎవరికైనా డబ్బు అత్యవసరమైనపుడు బ్యాంకు లోన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా పర్సనల్ లోన్స్‌పై ఎక్కువగా ఆధారపడుతారు. ఈ లోన్స్‌పై వడ్డీ వివిధ బ్యాంకుల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అయితే మీరు లోన్ తీసుకుంటే ఏ బ్యాంకు ప్రకారం ఎంత వడ్డీ చెల్లించాలి.. అంతేకాకుండా EMI ఎంత చెల్లించాలి తదితర విషయాలను ఒక్కసారి తెలుసుకుందాం.

వడ్డీ రేటు 10% కంటే తక్కువ
ఉదాహరణకు ఐదు లక్షల రూపాయలను బేస్‌గా తీసుకొని ఎంత చెల్లించాలో తెలుసుకుందాం.10 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులలో లోన్ EMI రూ. 10,525 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రుణం ఐదేళ్ల పాటు ఉంటుంది. SBI గురించి మాట్లాడితే 9.60 శాతం నుంచి 13.85 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. HSBC బ్యాంక్, సిటీ బ్యాంక్‌లో కూడా ఇదే వడ్డీ రేటు అమలులో ఉంది.10 శాతం వడ్డీ రేటుతో 10 నుంచి 11 వేల రూపాయల వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ రేటు 11% వరకు ఉంటుంది
కొన్ని బ్యాంకులు 11 శాతం వరకు వడ్డీ రేటును కలిగి ఉంటాయి. ఈ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా, IDFC ఫస్ట్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా క్యాపిటల్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. 5 సంవత్సరాల కాలపరిమితితో రూ.5 లక్షల రుణం కోసం ఈ వడ్డీ రేటులో రూ.11 వేల రూపాయల వరకు EMI చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 2.75 శాతం వరకు ఉంటుందని తెలుసుకోండి.

వడ్డీ రేటు 11 నుంచి 13 శాతం వరకు
అదే సమయంలో ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్‌తో సహా అనేక బ్యాంకులు 11 నుంచి 13 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తాయి. 13 శాతం కంటే ఎక్కువ వడ్డీ ఉన్న బ్యాంక్‌లో EMI రూ.11 వేల నుంచి రూ.11న్నర వేల రూపాయల మధ్య చెల్లించాలి.

వ్యక్తిగత రుణం ఎప్పుడు తీసుకోవాలి
కొన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై ఆఫర్లను ప్రకటిస్తాయి. ఉదాహరణకు వ్యక్తిగత రుణం సున్నా శాతం వడ్డీతో 6 నెలలు ఇస్తారు. అలాంటి రుణాలు మీకు సరైనవి కావచ్చు. కానీ నిర్ణీత వ్యవధిలో రుణాన్ని తిరిగి చెల్లించాలని గుర్తుంచుకోండి. లేదంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్‌బజార్ వంటి ఇంటర్నెట్‌లో అనేక వెబ్‌సైట్‌లు ఉన్నాయి. ఇక్కడ మీరు రుణ మొత్తం, వడ్డీ రేటు పోలికను చూడవచ్చు.

AP Weather Report : రానున్న 3 రోజుల్లో ఏపీలో ఓ మోస్తారు వర్షాలు..! గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు

Milk Benefits: పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.. కానీ, పాలను ఏ సమయంలో ఎలా తీసుకోవాలో తెలుసా?

Harishrao: ఈటల అరాచకాలపై పోచమల్లు వచ్చాడు.. న్యాయం – ధర్మం రెండూ గెలిచాయి: మంత్రి హరీశ్ రావు