రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచినప్పటి నుంచి, అన్ని బ్యాంకులు మీ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతున్నాయి. దీనికి సంబంధించి ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త వడ్డీ రేటు మే 24 నుంచి మాత్రమే వర్తిస్తుంది. ఇది 2 కోట్ల కంటే తక్కువ FDలకు ( ఫిక్సెడ్ డిపాజిట్లు ) వర్తిస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వడ్డీ రేటు 7-45 రోజుల పాటు 3 శాతంగా ఉంది. 46-90 రోజులకు వడ్డీ రేటు 3.25 శాతం నుంచి 3.50 శాతానికి పెరిగింది. 91-180 రోజులకు వడ్డీ రేటును 3.5 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. గతంలో 181-364 రోజులకు 5.15 శాతంగా ఉన్న వడ్డీ రేటు 5.40 శాతానికి పెరిగింది.12-18 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు 6 శాతానికి బదులుగా 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. 18 నెలల 1 రోజు నుంచి 36 నెలల వరకు, వడ్డీ రేటు మునుపటిలాగా 6.50 శాతం ఉంటుంది. 36 నెలల 1 రోజు నుంచి 42 నెలల వరకు వడ్డీ రేటు 6.75 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.
42 నెలల 1 రోజు నుంచి 48 నెలల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.75 శాతం, 48 నెలల 1 రోజు నుంచి 59 నెలల వరకు వడ్డీ రేటు 6.75 శాతం, 59 నెలల 1 రోజు నుండి 66 నెలల వరకు 7 శాతం, 66 నెలల 1 రోజు నుండి 84 నెలల వరకు వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటులో అదనంగా 0.50 శాతం ప్రయోజనం లభిస్తుంది. ఇది అన్ని అవధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వర్తిస్తుంది. ఇటీవల ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. కొత్త వడ్డీ రేటు మే 23 నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ వివిధ కాలాలకు వడ్డీ రేటును 1 శాతం వరకు పెంచింది. బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనిష్టంగా 3.5 శాతం మరియు గరిష్టంగా 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.