ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని అప్‌డేట్ చేయడానికి ఫిబ్రవరి 29 చివరి తేదీ. ఒకే వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేయడం, కేవైసీ పత్రాలు లేకుండా ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేయడం వంటి అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేవైసీ అప్‌డేట్ చేయబడుతోంది. గురువారం అంటే ఫిబ్రవరి 29 నాటికి మీ వాహనం FASTag KYC అప్‌డేట్ కాకపోతే, ఆ ఖాతాను డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది.
కేవైసీ అంటే ఏమిటి?
కేవైసీ అనేది పబ్లిక్ సర్వీస్ అందించే ఏ సంస్థ అయినా తన కస్టమర్ల రికార్డులను పొందాలి. మరీ ముఖ్యంగా ఆధార్ వంటి వ్యక్తిగత గుర్తింపు, చిరునామా రుజువు పత్రాలను పొందాలనే నిబంధన ఉంది. అది గ్యాస్ ఏజెన్సీ అయినా, సిమ్ కార్డ్ జారీ చేసే ఏజెన్సీ అయినా లేదా ప్రభుత్వ పథకం అయినా ఏదైనా కేవైసీ అవసరం. ఈ విధంగా కేవైసీ పొందకుండా సేవలు అందించే సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పేటీఎంపేమెంట్స్ బ్యాంక్ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే.
ఫాస్టాగ్ కేవైసీని ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయండిలా..
ఫాస్ట్‌ట్యాగ్‌ని హైవే అథారిటీ అయిన ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తుంది. మీరు దాని వెబ్‌సైట్ fastag.ihmcl.comలోని ఫాస్టాగ్ పోర్టల్‌కి వెళ్లడం ద్వారా అప్‌డేట్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…