Today Silver Rates (16-02-21): మళ్లీ పరుగులు పెడుతున్న వెండి ధర.. తాజాగా ఎంత పెరిగిందంటే..

|

Feb 16, 2021 | 6:46 AM

Today Silver Rates (16-02-21): గత నాలుగైదు రోజులుగా బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. మంగళవారం..

Today Silver Rates (16-02-21): మళ్లీ పరుగులు పెడుతున్న వెండి ధర.. తాజాగా ఎంత పెరిగిందంటే..
Follow us on

Today Silver Rates (16-02-21): గత నాలుగైదు రోజులుగా బంగారం ధరలు తగ్గుతుంటే వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. మంగళవారం దేశీయంగా కిలో వెండి ధరపై రూ.600 పెరిగింది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.69,800 ఉండగా, హైదరాబాద్‌లో 74,600 ఉంది. దేశ రాజధాని ముంబైలో కిలో వెండి రూ. 69,800 ఉండగా, చెన్నైలో రూ.74,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.70,300 ఉండగా, కోల్‌కతా రూ.69,800 ఉంది. ఇక విజయవాడలో రూ. 74,600 ఉంది.

ఇక దేశంలో బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు గల కారణాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి, వెండి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Today Gold Rates (16-02-21): పసిడి ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న బంగారం ధరలు.. తాజాగా ఎంత తగ్గిందంటే…