క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డుల విషయంలో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది స్కామర్లు పూణేకు చెందిన ఫిన్‌టెక్ నుంచి సెలబ్రిటీల పేరుతో క్రెడిట్ కార్డులు రెడీ చేశారు. వివిధ ప్రముఖుల పాన్, ఆధార్ వివరాలను ఉపయోగించి ఘరానా మోసానికి తెర తీశారు. ఆ క్రెడిట్ కార్డులను ఉపయోగించి బ్యాంకులకు 50 లక్షల రూపాయలను మోసం చేశారు. MS ధోని, సచిన్ టెండూల్కర్, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖుల పేరు మీద క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసేలా స్కామర్లు ఫిన్‌టెక్‌ని ఒప్పించగలిగారు. ఈ సెలబ్రిటీల తాజా పాన్ కార్డును జారీ చేయమని ప్రభుత్వ అధికారులను కూడా వారు దారిమళ్లించారు. వారు ‘వన్ కార్డ్’ అయిన పూణే ఆధారిత ఫిన్‌టెక్‌తో క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి నకిలీ పాన్ కార్డ్‌ను ఉపయోగించారు. వారు క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొత్తం 50 లక్షల రూపాయలను బ్యాంకులకు మోసం చేశారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ భద్రత లోపాలను వెలుగులోకి వీసుకువచ్చింది.
అయితే ఈ మోసగాళ్లు మోసాలకు పాల్పడేముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్‌లో సంపాదించారు. సాధారణంగా జీఎస్టీఐఎన్‌లో ఉండే మొదటి రెండు అంకెలు స్టేట్ కోడ్‌ను సూచిస్తాయి. మిగిలిన 10 అంకెల్లో పాన్ నంబర్‌ను సూచిస్తాయి. సెల్రబిటీలకు సంబంధించి పుట్టిన తేదీ వివరాలన్నీ గూగుల్‌లో లభించడంతో వీరి పని సులభతరం అయ్యింది. పుట్టిన తేదీ, పాన్ వివరాలు లభించడంతో వీరు కొత్త పాన్ కార్డుకు వారి వ్యక్తిగత ఫోటోలతో దరఖాస్తు చేశారు. వీడియో వెరిఫికేషన్ సమయంలో పాన్/ ఆధార్ వివరాలు వీరి ఫోటోలు సరిపోలే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మోసగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వీడియో వెరిఫికేషన్ సమయంలో ఏమాత్రం పొరపాటు లేకుండా ఈ మోసగాళ్లు జాగ్రత్త పడ్డారు. అప్పటికే సెలబ్రిటీల తాలుకా ఆర్థిక కార్యకలాపాల వివరాలు వారు సంపాదించుకుని రెడీగా పెట్టుకున్నారు. అసలు క్రెడిట్ కార్డుల జారీ, ఆన్‌లైన్ వెరిఫికేషన్‌లో ఉన్న లోపాల గురించి కొన్ని నెలల పాటు పరిశోధించారు. వీడియో వెరిఫికేషన్ కంటే ముందు క్రెడిట్ కార్డు కోసం యాప్‌లో పాన్, ఆధార్ వివరాలను తమ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసినట్లు సదరు సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. అసలు పాన్ కార్డు, ఆధార్ వివరాల స్థానే నకిలీ పాన్, ఆధార్ వివరాలు ఇచ్చారని ఆ కంపెనీ పేర్కొంది. ఫేక్ వివరాలతో అప్లై చేసినప్పటికీ.. బ్యూరో వద్ద ఉన్న పాన్, క్రెడిట్ లిమిట్ వివరాల ఆధారంగా ఒక్కో క్రెడిట్ కార్డుకు రూ.10 లక్షల లిమిట్ చొప్పున జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి