నకిలీ రూ.20 నాణేలు కలకలం.. మీ దగ్గర ఉన్నది అసలైనదా..? నకిలీదా? ఇలా గుర్తు పట్టేయండి..

ప్రస్తుతం మార్కెట్లో నకిలీ నాణెంలు కూడా చలామణి అవుతున్నాయి. దీంతో మీ జేబులో ఉన్నది అసలైన నాణెమా.. లేదా నకిలీదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పటివరకు నకిలీ కరెన్సీ నోట్ల గురించి మాత్రమే విన్న జనం.. ఇప్పుడు నకిలీ నాణెల గురించి విని ఆశ్చర్యపోతున్నారు.

నకిలీ రూ.20 నాణేలు కలకలం.. మీ దగ్గర ఉన్నది అసలైనదా..? నకిలీదా? ఇలా గుర్తు పట్టేయండి..
20 Rupees Coin

Updated on: Sep 25, 2026 | 3:22 PM

నకిలీ కరెన్సీ నోట్లు చలామణి కావడం, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం లాంటి వార్తలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు నకిలీ నాణేలు కూడా మార్కెట్లో చలామణి అవుతున్నాయి. నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేయడం సులువు. కానీ నకిలీ నాణేలను కూడా ఇప్పుడు తయారుచేసి మార్కెట్లోకి వదులుతున్నారు అక్రమార్కులు. తాజాగా నకిలీ రూ.20 నాణేలు వెలుగులోకి వచ్చాయి. ఇత్తడితో ఇనుము, జింక్ పూత పూసి ఉండి అసలైన నాణేలతో పోలి ఉన్న నకిలీ కాయిన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు అక్రమార్కులు. తాజాగా ఇలాంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో నకిలీ రూ.20 నాణెంలను గుర్తించడం ఎలా..? మీ దగ్గర ఉన్నది అసలైనదా..? లేదా నకిలీదా అనేది ఎలా గుర్తించాలి? అనేది ఇప్పుడు చూద్దాం.

నకిలీ నాణెలను ఎలా తయారుచేస్తారు..?

ఇనుము, జింక్ పలకను కోసి నాణెం అడుగు భాగాన్ని తయారుచేస్తారు. ఆ తర్వాత కోసిన తర్వాత నాణెం లోపల ఒక చిన్న భాగాన్ని తయారుచేసి ఇత్తడి పూత పూస్తారు. ప్రత్యేక అచ్చులు, అత్యాధునిక యంత్రాల సాయంతో నాణెంపై అధికారిక డిజైన్, గుర్తులను ముద్రిస్తారు. దీంతో నకిలీ నాణెలను సలువుగా గుర్తు పట్టవచ్చు.

నకిలీ నాణెంను గుర్తించడం ఎలా..?

రూ.20 నాణెం పూర్తిగా గుండ్రంగా ఉండదు. దీంతో ఎవరైనా సులువగా గుర్తించగలరు. ఇక అంచుల్లో ఎలాంటి అడ్డ లేదా నిలుపు రంగు పళ్లు ఉండవు. అంచు పూర్తిగా నినుపుగా, చదునుగా ఉంటుంది. అసలైన రూ.20 నాణెం బరువు 8.54 గ్రాములు ఉంటుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దీనిని నిర్ణయించారు. ఇక రూ.20 నాణెం వెనువపైపు ధాన్యపు గింజలను చిత్రీకరించే ప్రత్యేక డిజైన్ ఉంటుంది. రూ.20 నాణెంను రింగ్, కోర్ అనే రెండు భాగాలతో తయారుచేస్తారు. బయటి రింగ్ నికెల్ సిల్వర్‌తో తయారుచేస్తారు. ఇందులో 65 శాతం రాగి, 15 శాతం జింక్, 20 శాతం నికెల్ ఉంటాయి. ఇక కోర్ భాగాన్ని నికెల్ బ్రాస్‌తో తయారుచేస్తారు. ఇందులో 75 శాతం రాగి, 20 శాతదం జింక్, 5 శాతం నికెల్ ఉంటాయి. కాగా ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో పోలీసులు తాజాగా నకిలీ రూ.20 నాణేలను తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు.  వారి నుంచి నాణేల తయారీకి వాడే సామాగ్రి, ఒక ప్రత్యేకమైన అచ్చును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో నకిలీ నాణెల తయారీ గుట్టు బయటపడింది. ఇప్పటివరకు నకిలీ కరెన్సీ నోట్ల గురించి అందరూ వినగా.. ఇప్పుడు నకిలీ నాణేలు కూడా తయారుకావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us