Fact Check: భారత్-పాక్ యుద్ధం కారణంగా మూడు రోజులు ఏటీఎంలు మూసి ఉంటాయా?

Fact Check: భారత్‌- పాకిస్తాన్‌ యుద్ధం కొనసాగుతోంది. పాక్‌ కవ్వింపు చర్యలను భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. అయితే ఈ వార్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా మూడు రోజుల పాటు ఏటీఎంలు బంద్‌ ఉండనున్నాయని..

Fact Check: భారత్-పాక్ యుద్ధం కారణంగా మూడు రోజులు ఏటీఎంలు మూసి ఉంటాయా?
ఏటీఎం రూల్స్‌: ATM లావాదేవీ ఛార్జీలలో మార్పులు జరగవచ్చు. జూన్ 1 నుండి కొత్త నియమాలు ప్రస్తుత ఉచిత-పరిమితి లావాదేవీలకు మించి ఉపసంహరణ రుసుములను పెంచవచ్చు. ఇది తరచుగా ATM వినియోగదారులపై ప్రభావం చూపుతుంది.

Updated on: May 09, 2025 | 4:31 PM

పొరుగు దేశాలైన భారతదేశం -పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఇంటర్నెట్‌లో తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది. దేశంలో ATMలు 2-3 రోజులు మూసివేయబడతాయని వాట్సాప్‌లో ఒక సందేశం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్‌లో జరుగుతున్న వార్‌ కారణంగా రాబోయే రెండు, మూడు రోజుల్లో ఏటీఎంలు మూసి ఉండనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈరోజు ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలు చేయవద్దు. మీ జాబితాలోని అన్ని కాంటాక్ట్‌లకు ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ అనే వీడియోను ఓపెన్‌ చేయవద్దు అనే సందేహం వైరల్‌ అవుతోంది.

 

అయితే ఈ వైరల్‌ వార్తలపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరియర్స్ (PIB) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్‌న్యూస్‌ అంటూ స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి సందేశాలను నమ్మవద్దని సూచించింది. అలాగే ATM సేవలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది.
“ATMలు 2-3 రోజులు మూసివేయబడతాయని వైరల్ అవుతున్న #WhatsApp సందేశం. ఈ సందేశం నకిలీ ATMలు యథావిధిగా పనిచేస్తాయని చెబుతోంది” అని PIB ఫ్యాక్ట్ చెక్ బృందం Xలో ఒక పోస్ట్‌లో పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి