Fact Check: ఈ ఏడాది మార్చిలోగా రూ.500 నోట్లు రద్దు అవుతాయా? కేంద్రం క్లారిటీ!

Fact Check: ప్రస్తుతం పెద్ద నోట్లలో 500 రూపాయలు మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. అయితే ఈ నోట్లు ఈ ఏడాది మార్చిలోగా రద్దు కానున్నాయని, ఇక మార్కెట్లో కనిపించవద్ద ఇటీవల నుంచి సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. అయితే నిజంగానే 500 రూపాయల నోట్లు ఆర్బీఐ నిలిపివేస్తుందా? దీనిపై కేంద్రం ఎం చెబుతోంది?

Fact Check: ఈ ఏడాది మార్చిలోగా రూ.500 నోట్లు రద్దు అవుతాయా? కేంద్రం క్లారిటీ!
500 Notes Fact Check

Updated on: Jan 03, 2026 | 9:45 AM

Fact Check: ఇటీవల రూ.500 నోటు గురించిన ఒక వాదన సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 నాటికి ATMల నుండి రూ.500 నోట్లను తొలగిస్తుందని, రూ.500 నోట్లు త్వరలో నగదు వ్యవస్థ నుండి అదృశ్యమవుతాయని పేర్కొంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో సహా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ అవుతోంది. అయితే PIB ఫ్యాక్ట్ చెక్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. 500 రూపాయల నోట్లు ఇక మార్కెట్లో ఉండవనే వార్త పూర్తిగా అబద్దమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్-చెక్కింగ్ విభాగం అటువంటి వార్తలు తప్పుదారి పట్టించేవని, వాస్తవికత ఆధారంగా లేవని పేర్కొంది. దీని అర్థం మార్చి 2026 నాటికి రూ.500 నోట్లను రద్దు చేసే ప్రణాళికలను RBI ఇంకా ప్రకటించలేదు.

RBI ATMల నుండి రూ.500 నోట్లను పూర్తిగా తొలగిస్తుందని, మార్చి 2026 తర్వాత అవి బ్యాంకింగ్ వ్యవస్థలో చెల్లుబాటు కావని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ఈ వార్త ఇది చాలా మందిలో ఆందోళన, గందరగోళానికి కారణమైంది. దీంతో కేంద్రం ఆధీనంలో ఉన్న ఫ్యాక్ట్‌ చెక్‌ ఇది ఫేక్‌ న్యూస్‌ అంటూ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

నోట్ల రద్దుకు సంబంధించి ఆర్బీఐ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. 500 రూపాయల నోటు గురించి ప్రచారంలో ఉన్న వార్తలు అబద్ధమని, పుకార్ల ఆధారంగా ఉన్నాయని స్పష్టం PIB చేసింది.

ఆర్‌బిఐ ఏమీ చెప్పలేదా?

రిజర్వ్ బ్యాంక్ తన నోట్ల రీసైక్లింగ్ లేదా విడుదల వ్యూహాన్ని కాలానుగుణంగా సమీక్షిస్తుందని గమనించడం ముఖ్యం. కానీ ఇది ఏదైనా ప్రత్యేకమైన నోటును తొలగించడానికి దారితీయదు. ప్రస్తుతం భారతదేశంలో రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉన్నాయి. ప్రజలు వాటిని నిరంతరం ఉపయోగించడంలో ఎటువంటి మార్పు లేదు.

 

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?