Fact Check: రేషన్‌కార్డుదారులకు షాక్‌.. ప్రభుత్వం గోధుమల పంపిణీ నిలిపివేస్తుందా..?

|

Mar 02, 2023 | 9:25 PM

కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది కార్డుదారులకు ఉచిత రేషన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. మీరు కూడా ఉచిత రేషన్ తీసుకుంటున్నట్లయితే..

Fact Check: రేషన్‌కార్డుదారులకు షాక్‌.. ప్రభుత్వం గోధుమల పంపిణీ నిలిపివేస్తుందా..?
Ration Card Holders
Follow us on

కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది కార్డుదారులకు ఉచిత రేషన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. మీరు కూడా ఉచిత రేషన్ తీసుకుంటున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. ఇక నుంచి గోధుమలు ప్రభుత్వం నిలిపివేస్తుందా..? ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనేక రకాల తప్పుడు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చాలా మంది వీటిని నమ్ముతున్నారు.

ఇటీవల ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం మార్చి 1 తర్వాత రేషన్ కార్డు హోల్డర్లకు గోధుమలు ఇవ్వదని పేర్కొంది. ఈ రోజుల్లో ప్రభుత్వం ఉచిత రేషన్‌లో కార్డుదారులకు గోధుమలు, బియ్యం ఇస్తోంది. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో ఉప్పు, పంచదార కూడా ఇస్తున్నారు. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత వాస్తవాన్ని పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌ చెక్‌ ద్వారా ట్వీట్‌ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. PIB Fact Check తన అధికారిక ట్వీట్‌లో ‘టెక్నికల్ బ్లాగ్’ అనే #Youtube ఛానెల్ వీడియోలో మార్చి 1, 2023 నుండి రేషన్ కార్డ్ హోల్డర్‌లు గోధుమలను పొందలేరని వీడియోలో చూడవచ్చు.

అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియో పూర్తి అబద్దమని స్పష్టం చేసింది పీఐబీ. రేషన్‌ సరుకులపై భారత ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఫేక్‌ వీడియోలను చూసి ఇతరులకు షేర్‌ చేయవద్దని సూచించింది. అలాంటి మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు మీరు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే మీరు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే సంప్రదించాలని కోరింది.

 

వైరల్ సందేశాల కోసం వాస్తవ తనిఖీ చేయవచ్చు:

ఇలాంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ప్రస్తుతానికి అలాంటి వార్తలను ఫార్వార్డ్ చేయకండి. మీరు ఏదైనా వైరల్ సందేశం నిజమా..? కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నంబర్ 918799711259 లేదా socialmedia@pib.gov.in కు మెయిల్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి