AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!

PIB Fact Check: ఆర్‌బిఐ ప్రకారం, సెప్టెంబర్ 2025 చివరి నాటికి భారతదేశ మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 13.92%గా ఉంది. జూన్ 2026 నాటి తాజా డేటా ప్రకారం.. ఈ వాటా తగ్గడానికి బదులుగా, జూన్ 2026 నాటికి 16.70%కి పెరిగింది..

Fact Check: ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
Fact Check
Subhash Goud
|

Updated on: Jun 03, 2026 | 12:25 PM

Share

Fact Check: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారు నిల్వలకు సంబంధించి ఒక సంచలన నివేదిక ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఆర్‌బిఐ సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందని ఈ వైరల్ నివేదిక పేర్కొంటోంది.

ఈ వార్త భారతదేశ విదేశీ మారక నిల్వలు, దేశ ఆర్థిక భద్రతకు సంబంధించినది కావడంతో ప్రభుత్వ అధికారిక వాస్తవ తనిఖీ విభాగమైన పిఐబి ఫ్యాక్ట్ చెక్ దీనిని వెంటనే పరిగణనలోకి తీసుకుని దీనిపై క్లారిటీ ఇచ్చింది. అయితే అంతర్జాతీయంగా వైరల్‌ అవుతున్న ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పీఐబీ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా నకిలీదని, ఇందులో నిజం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం అధికారికంగా స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌.. మూడు పుణ్యక్షేత్రలను కలిపే ప్రత్యేక రైలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అధికారిక, ప్రామాణిక డేటాను ఉటంకిస్తూ, భారతదేశం తన బంగారు నిల్వలను తగ్గించుకోవడం లేదని, పైగా వాటిని నిరంతరం పెంచుకుంటోందని పిఐబి పేర్కొంది.

ఆర్‌బిఐ ప్రకారం, సెప్టెంబర్ 2025 చివరి నాటికి భారతదేశ మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 13.92%గా ఉంది. జూన్ 2026 నాటి తాజా డేటా ప్రకారం.. ఈ వాటా తగ్గడానికి బదులుగా, జూన్ 2026 నాటికి 16.70%కి పెరిగింది. ఈ గణాంకాల నుండి రిజర్వ్ బ్యాంక్ తన బంగారాన్ని విక్రయించలేదని, పైగా భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా మునుపెన్నడూ లేనంత బలంగా మారిందని స్పష్టమవుతోంది.

తప్పుదారి పట్టించే వార్తల పట్ల జాగ్రత్త:

ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఇటువంటి సున్నితమైన వార్తలను గుడ్డిగా నమ్మవద్దని ప్రభుత్వం, ఆర్థిక విశ్లేషకులు ప్రజలను, పెట్టుబడిదారులను కోరారు. వైరల్ అవుతున్న ఏ వార్తను అయినా పంచుకునే ముందు ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ లేదా పిఐబి వంటి విశ్వసనీయ వనరుల ద్వారా దాని ప్రామాణికతను ధృవీకరించుకోండి. అయితే గత కొన్ని నెలలుగా బంగారం నిల్వలు నిరంతరం పెరుగుతూనే వస్తోంది. ఆర్‌బీఐ విడుదల చేసిన స్పష్టమైన గణాంకాలను పరిశీలిస్తే..

  • సెప్టెంబర్ ముగింపు 2025: మొత్తం విదేశీ నిల్వలలో బంగారం వాటా 13.92% గా ఉంది.
  • మార్చి 31, 2026: ఈ వాటా మరింత పెరిగి 16.70% కి చేరుకుంది.
  • మే 22, 2026: ఇది ఇంకా పెరిగి 16.85% కి చేరింది.

ముఖ్య గమనిక: ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఇటువంటి సున్నితమైన విషయాలపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. ఎల్లప్పుడూ నిజమైన, అధికారిక సమాచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ను మాత్రమే సంప్రదించండి.

ఇది కూడా చదవండి: Silver: ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
భారత్‌లో ఆ ఒక్క కారణంతోనే 70 శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
భారత్‌లో ఆ ఒక్క కారణంతోనే 70 శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!