కేంద్రం ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లను అందించనుంది. దేశంలోని 1 కోటి మంది ప్రజలు ఆన్‌లైన్‌లో ఇంట్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఉచిత స్మార్ట్‌ఫోన్‌ను పొందుతారు. ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ ఉండాల్సి ఉంటుంది. మీకు 18 సంవత్సరాలు ఉంటే మీరు ఈ పథకం ప్రయోజనాలను పొందుతారు. అంటే ఈ పథకం కింద మీకు ఉచిత స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. YouTube ఛానెల్ వీడియో థంబ్‌నెయిల్స్ చూస్తే నిజమనే అనిపిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వైరల్ వార్త పూర్తిగా అబద్దమని తెల్చి చెప్పంది. X హ్యాండిల్‌లో ఛానెల్ పేరు, వీడియో ఫోటో ద్వారా బీఐబీ (PIB) ప్రభుత్వంలో అలాంటి పథకం లేదని, వీడియో థంబ్‌నెయిల్ అబద్ధాలను వ్యాప్తి చేస్తుందని, దీనిని ఎవ్వరు కూడా నమ్మవద్దని స్పష్టం చేసింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం, ‘సర్కారీ సౌచ్నా’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక వీడియో కేంద్ర ప్రభుత్వం 1 కోటి మందికి ఉచిత మొబైల్ ఫోన్‌లను ఇస్తుందని పేర్కొంది. దీనికి ఉచిత స్మార్ట్‌ఫోన్ యోజన అని కూడా పేరు పెట్టారు. ఆర్థిక పరిస్థితి బాగా లేని కుటుంబ సభ్యులకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా ఉచితంగా మొబైల్ ఫోన్లు అందజేస్తామని ఈ యూట్యూబ్ ఛానెల్ వీడియో చెబుతోంది. అయితే ఈ ఉచిత స్మార్ట్‌ఫోన్ ఎందుకు ఇవ్వబడుతుందని, ఈ పథకం డిజిటల్ ఇండియా కింద ప్రారంభినట్లు వైరల్ అవుతోంది.
⚠️सतर्क रहें⚠️
यू-ट्यूब चैनल “sarkarisuchnaa” के एक वीडियो थंबनेल में दावा किया जा रहा है कि “फ्री मोबाइल योजना” के तहत एक करोड़ लोगों को नि:शुल्क मोबाइल फोन दिया जाएगा। #PIBFactCheck
✅ यह दावा फर्जी है।
➡️संदिग्ध जानकारी का स्नैपशॉट यहाँ साझा करें –
📲 +91879971125 pic.twitter.com/8QnxXPZlxM— PIB Fact Check (@PIBFactCheck) December 11, 2024
అంతేకాదు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి ఎక్కడా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని వీడియోలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఫారమ్ నింపి ఎంపిక చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి మొబైల్ కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఇప్పటికే 2 మిలియన్ల మందికి మొబైల్స్ అందించినట్లు కూడా పేర్కొన్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత మొబైల్ మాత్రమే కాదు, 3 సంవత్సరాల డేటా, అపరిమిత కాలింగ్ కూడా ఉచితంగా అందించనుందని ఈ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రాజస్థాన్ ప్రభుత్వ వెబ్‌సైట్‌కు వెళ్లాలని సూచించింది. ఈ వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అబద్ధమని పీఐబీ స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి పథకాన్ని ప్రారంభించలేదని పేర్కొంది. సో.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పూర్తిగా అబద్దం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి