ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన 6 కోట్లకుపైగా సభ్యులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడంతో ముందస్తుగా అలర్ట్ చేస్తోంది. మీరు కూడా ఈపీఎఫ్‌వో సభ్యులైతే అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యం. సైబర్ నేరాల గురించి సభ్యులను అప్రమత్తం చేసింది. పీఎఫ్ ఖాతా పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయిన. మోసగాళ్లు ఈపీఎఫ్‌వో పేరుతో వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా అడిగేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈపీఎఫ్‌వో సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈమేరకు ఈపీఎఫ్‌వో ట్విట్ చేసింది. నకిలీ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల గురించి జాగ్రత్తగా ఉండాలని, ఈపీఎఫ్వోతన సభ్యులను ఫోన్, ఈ-మెయిల్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత వివరాలను పంచుకోమని ఎప్పుడూ అడగదని సూచించింది. ఈపీఎఫ్‌వో, ఉద్యోగులు ఎప్పుడూ ఎలాంటి సమాచారాన్ని అడగరు. అలాగే యూఏఎన్, పాన్, పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఆధార్, ఆర్థిక వివరాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. లేకపోతే తీవ్రంగా మోసపోయే ప్రమాదం ఉందని తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఈపీఎఫ్‌లో కార్యాలయం నుంచి అంటూ ఫోన్‌లు చేస్తూ మీ వివరాలు తెలుసుకుని మీ ఖాతాలో ఉన్న డబ్బును క్షణాల్లోనే ఖాళీ చేస్తారని హెచ్చరించింది. మీరు అప్రమత్తంగా లేకపోతే తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌వో హెచ్చరించింది.
ఉద్యోగుల పదవీ విరమణ కోసం ఈపీఎఫ్వోపదవీ విరమణ నిధిని సేకరిస్తుందని, దీని కింద కంపెనీ, ఉద్యోగుల తరపున డబ్బు జమ చేయబడుతుందని, ఈపీఎఫ్ ఖాతా కింద ఉద్యోగుల ప్రాథమిక జీతంలో 12 శాతం, అదే మొత్తం కంపెనీ నుండి జమ చేయబడుతుందని తెలిపింది. ప్రతి నెలా జమ చేసిన ఈ మొత్తంపై సంవత్సరానికి 8.1% వడ్డీ అందిస్తారు. పదవీ విరమణ వయస్సు వచ్చినప్పుడు మొత్తం ఉద్యోగులకు చెల్లిస్తారు.
#EPFO कभी भी अपने सदस्यों से व्यक्तिगत विवरण जैसे आधार, पैन, यूएएन, बैंक खाता या ओटीपी फोन या सोशल मीडिया पर साझा करने के लिए नहीं कहता है।#amritmahotsav #alert #beware #StaySafe #stayalert pic.twitter.com/Dp0QkJihhQ
— EPFO (@socialepfo) December 11, 2022
ప్రభుత్వం గత మార్చిలో పీఎఫ్ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది. దాదాపు 40 ఏళ్లలో ఇదే కనిష్ట వడ్డీ రేటు. ఉద్యోగి జీతంపై 12% మినహాయింపు ఈపీఎఫ్ ఖాతా కోసం తీసివేస్తారు. ఉద్యోగి జీతంలో యజమాని చేసిన కోతలో 8.33 శాతం ఈపీఎస్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌కు చేరగా, 3.67 శాతం ఈపీఎఫ్‌కు చేరుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి