
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) మరో కీలక నిర్ణయం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్‌కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది. అదేంటంటే.. ఇక నుంచి మీ అకౌంట్లో ఖచ్చితంగా 25 శాతం మినిమం బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంకు అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ నిబంధన తరహాలో పీఎఫ్ కూడా కనీస నిల్వను తప్పనిసరి చేయనుంది. పీఎఫ్ నగదులో 25 శాతం బ్యాలెన్స్‌ను మినహాయింపు మిగతా సొమ్ము మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ నిర్ణయానికి ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. దీంతో జులై 1వ తేదీ నుంచి దీనిని అమలు చేస్తున్నారు.
ఉద్యోగులు మొత్తం విత్ డ్రా చేసుకోవడం వల్ల పదవీ విరమణ సమయంలో నిధి ఉండటం లేదు. దీని వల్ల ఉద్యోగులకు ఆర్ధిక భద్రత ఉండటం లేదు. ఈ విషయాన్ని గమనించిన పీఎఫ్ సంస్థ.. ఉద్యోగ విరమణ సమయంలో కనీసం రూ.20 వేలు కూడా చేతికి రావడం లేదని గుర్తించింది. దీంతో కనీస బ్యాలెన్స్ 25 శాతం నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని వల్ల పదవీ విరమణ తర్వాత కొంత సొమ్ము చేతికి అందుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్ధిక అవసరాలకు ఇవి ఉపయోగపడతాయని ఈపీఎఫ్‌వో చెబుతోంది. ఉద్యోగి, యజమాని వాటాతో పాటు వడ్డీ కలిపితే వచ్చేది పీఎఫ్ బ్యాలెన్స్. పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సమయంలో ఈ మొత్తంలో 25 శాతం కనీస బ్యాలెన్స్ ఉంచి.. మిగతా నిధులు ఖాతాదారులు తీసుకోవచ్చు. ఇప్పటివరకు మినిమం బ్యాలెన్స్ రూల్ లేదు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు.
ఈపీఎఫ్‌వోకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను జులై 1వ తేదీ నుంచి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995 పథకాల స్థానంలో ఈపీఎఫ్-2026, ఈపీఎస్ 2026 పథకాలను ప్రారంభించనుంది. ఈ పథకాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న పీఎఫ్ వెబ్‌సైట్ స్థానంలో కొత్త పోర్టల్, పీఎఫ్ క్లెయిమ్స్ ఆటో సెటిల్మెంట్, ఐటీ వ్యవస్థను తీసుకురానుంది. ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడేషన్ చేయడం వల్ల క్లెయిమ్స్ వేగవంతంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 30 వరకు పీఎఫ్ వెబ్ సైట్, ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ యాక్సెస్ సేవలను నిలిపివేశారు. పీఎఫ్ ఆన్‌లైన్ సేవలను అప్‌డేట్ చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. వచ్చే నెల నుంచి మళ్లీ పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.