పిఎఫ్ ఖాతాకు నామిని వివరాలు లింక్ చేశారా.. వెంటనే చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు..

|

Dec 18, 2022 | 1:27 PM

ప్రయివేట్ రంగంలో కూడా చాలా మంది వేతన జీవులు వారి జీతం నుంచి భవిష్య నిధిని చెల్లిస్తారు. కాని చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కొంతమందికి పిఎఫ్‌పై సరైన అవగాహన ఉండకపోవడం..

పిఎఫ్ ఖాతాకు నామిని వివరాలు లింక్ చేశారా.. వెంటనే చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు..
'సేవ్ EPS నామినేషన్' బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు, OTPని రూపొందించడానికి 'E-సైన్'పై క్లిక్ చేయండి. ఆ తర్వాత OTP మీ ఆధార్-లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వస్తుంది. దానిని సమర్పించండి.
Follow us on

ప్రయివేట్ రంగంలో కూడా చాలా మంది వేతన జీవులు వారి జీతం నుంచి భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్) ను చెల్లిస్తారు. కాని చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కొంతమందికి పిఎఫ్‌పై సరైన అవగాహన ఉండకపోవడం కారణం కావచ్చు. పిఎఫ్ ఖాతాలో మన జీతం నుంచి జమచేసిన మొత్తం ఎంతో సెక్యూర్‌గా ఉంటుంది. ఆ మొత్తాన్ని పిఎఫ్ ఖాతా గల వ్యక్తి కాకుండా మరో వ్యక్తి తీసుకునే అవకాశం లేదు. అయితే పిఎఫ్ ఖాతాగల వ్యక్తి ఏదైనా కారణంగా మృతిచెందడం లేదా ఇతర సందర్భాల్లో ఆ పిఎఫ్ డబ్బులు తాను నామినేట్ చేసిన కుటుబం సభ్యులకు సంస్థ చెల్లిస్తుంది. దీనికోసం తాను ఎవరిని నామినిగా పెట్టాలనుకుంటున్నారో వారి వివరాలను తప్పకుండా నింపాలి. ప్రస్తుతం పిఎఫ్ క్లెయిమ్ చేయాలన్న తప్పకుండా నామిని వివరాలు పొందుపర్చాలి. లేదంటే పిఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ కాదు. పిఎఫ్ ఖాతాలో నామిని వివరాలు పొందుపర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తెలిపింది. ఎవరైతే పిఎఫ్ ఖాతాదారులు ఉన్నారో వారు ఇ-నామినేషన్‌ ఆప్షన్‌లో వివరాలు పొందుపర్చడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

సభ్యుల పెన్షన్ క్లెయిమ్ త్వరితగతిన పరిష్కారం అవుతుంది. పిఎఫ్ ఖాతాకలిగిన వ్యక్తి మృతిచెందితే ఖాతాదారుడు నామినేట్ చేసిన వ్యక్తులకు పిఎఫ్‌ సెటిల్‌మెంట్ వేగవంతంగా జరుగుతుంది. ఈ-నామినేషన్ ఆప్షన్‌లో వివరాలు పొందుపర్చడం ద్వారా ఈపీఎఫ్‌వో కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా పేపర్‌లెస్ క్లెయిమ్ ప్రాసెస్ చేయవచ్చు. ఇ-నామినేషన్ వివరాలు దాఖలు చేయడం వల్ల ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్), పెన్షన్ (ఈపీఎస్), ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) ప్రయోజనాలను సభ్యుని మరణం తర్వాత కుటుంబ సభ్యులు సులభంగా పొందే వీలుంటుంది.

ఈ-నామినేషన్‌ చేసే విధానం

ఈ నామినేషన్ వివరాలు పొందుపర్చాలంటే ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్‌ను ఓపెన్ చేయాలి లేదా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా నేరుగా వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

యుఎఎన్ అని ఉన్న చోట మన యుఎఎన్( యూనివర్షల్ అకౌంట్ నెంబర్)ను ఎంటర్ చేయాలి. తరువాత పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. అనంతరం క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఎక్కువుగా వచ్చే సమస్య చాలా మంది యుఎఎన్ నెంబర్‌ను మర్చిపోతారు. ఒకవేళ యుఎఎన్ సంఖ్య తెలిసినప్పటికి దానిని యాక్టివ్ చేసి ఉండకపోవడంతో లాగిన్‌లో సమస్య ఏర్పడుతుంది. లాగిన్‌లో సమస్య ఏర్పడేవారు అదే వెబ్ సైట్‌లో కింద మీ యుఎఎన్ నెంబర్ తెలుసుకోండి(నౌ యుఎఎన్) అన్న చోట ఎంటర్ చేయ్యాలి. ఆధార్ సంఖ్య పిఎఫ్ ఖాతాతో అనుసంధానం అయిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఆధార్ సంఖ్య అనుసంధానం కాకపోతే వెంటనే పిఎఫ్‌ ఖాతాకు ఆధార్ సంఖ్యను జోడించాలి. దీనికోసం మీరు పనిచేస్తున్న సంస్థలో సంప్రదించాల్సి ఉంటుంది. నౌ యుఎఎన్ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత.. పిఎఫ్ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. దాని కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేస్తే యుఎఎన్ నెంబర్ తెలుస్తుంది.

యుఎఎన్ సంఖ్య తెలుసుకున్న తర్వాత https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్‌ను సందర్శించి యాక్టివ్ యూఎఎన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆధార్ తదితర వివరాలను ఎంటర్ చేసి.. తరువాత ఆధార్ సంఖ్య అనుసంధనమైన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటిపి ఎంటర్ చేసి పిఎఫ్ ఖాతాను యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఒక పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. దీనిని జాగ్రత్తగా గుర్తించుకోవాలి. తరువాత https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్ ను సందర్శించి యుఎఎన్ సంఖ్య, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మేనేజ్ అని ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఈ-నామినేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి.. వివరాలు పొందుపర్చాలి. ఈ-నామినేషన్ వివరాలు పొందుపర్చే సమయంలో ఎవరిని అయితే నామినిగా పెట్టాలనుకుంటున్నామో వారి ఆధార్ కార్డు, ఫోటో కలిగి ఉండాలి. వాటిని స్కాన్ చేసి ఎటాచ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా ఆధార్ సంఖ్యకు అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటిపి ద్వారా ఈ-సిగ్నేచర్‌ను విజయవంతంగా పూర్తిచేస్తే.. ఈ-నామినేషన్ వివరాలు పొందుపర్చినట్లే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..