
EPFO New Rules: ఉద్యోగుల భవిష్య నిధి (PF) అనేది అత్యవసర సమయాల్లో ఆదుకునే ఒక గొప్ప ఆర్థిక వనరు. గతంలో పీఎఫ్ డబ్బులు చేతికి అందడానికి నెలల సమయం పట్టేది. కానీ ఇప్పుడు EPFO నిబంధనలను సరళతరం చేయడంతో కేవలం కొన్ని రోజుల్లోనే నగదు ఖాతాలో జమ అవుతోంది. అయితే ఒక నెలలో ఎన్నిసార్లు పీఎఫ్ విత్‌డ్రా చేయవచ్చు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి సమాధానం ఇక్కడ తెలుసుకోండి.
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు టికెట్ లేదా? అర్జెంట్‌గా వెళ్లాలా? టికెట్ లేకుండానే రైలు ఎక్కవచ్చు.. రైల్వే రూల్స్ ఇవే!
పీఎఫ్ ఖాతా నుండి ఒక నెలలో ఎన్నిసార్లు డబ్బు విత్‌డ్రా చేయాలనే దానిపై EPFO ఎటువంటి కఠినమైన పరిమితిని విధించలేదు. మీరు నెలకు ఒకటి కంటే ఎక్కువసార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
మీరు డబ్బు ఎందుకు తీస్తున్నారో దానికి తగిన కారణం చెప్పాలి:
ఒక క్లెయిమ్ ప్రాసెస్ అవ్వడానికి సాధారణంగా 3 నుండి 20 రోజుల సమయం పడుతుంది. అందుకే ఒకే నెలలో ఎక్కువ క్లెయిమ్‌లు చేస్తే ప్రాసెసింగ్‌లో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ మీరు ఉద్యోగం కోల్పోతే, ఆ తర్వాత ఒక నెల వరకు ఖాళీగా ఉంటే మీ పీఎఫ్ నిధిలో 75% విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండో నెల కూడా ఉద్యోగం లేకపోతే మిగిలిన 100% మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
మీరు పాక్షిక విత్‌డ్రా (Partial Withdrawal) చేయాలంటే కనీసం 12 నెలల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
5 ఏళ్ల కంటే తక్కువ సర్వీస్ ఉండి డబ్బు విత్‌డ్రా చేస్తే TDS (Tax) కట్ అవుతుంది.
ఇది కూడా చదవండి: D-Mart Secrets: డి-మార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. రూ.5000 బిల్లును రూ.2000కు తగ్గించుకునే సూపర్ ట్రిక్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి