పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ఖాతాల్లోకి వడ్డీ డబ్బు జమలను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో కీలక ప్రకటన చేసింది. ‘వడ్డీ జమ ప్రక్రియ ప్రారంభమైందని.. త్వరలోనే మీ ఖాతాల్లోకి పూర్తి వడ్డీ డబ్బు పడుతుందని’ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్ఓ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చింది.
మరోవైపు 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ వడ్డీరేటును 8.1 శాతంగా ఈపీఎఫ్ఓ ప్రకటించిన విషయం తెలిసిందే. నెల రోజుల్లో పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలోకి వడ్డీ డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది. మీ పీఎఫ్ ఖాతాలోకి జమ అయ్యే వడ్డీ డబ్బును ఎలా చూడవచ్చునంటే.. మొదటిది పీఎఫ్ వడ్డీ డబ్బును ఈపీఎఫ్ఓ అఫీషియల్ సైట్ సందర్శించి ఆన్‌లైన్ ద్వారా చూడొచ్చు.
రెండోది ఖాతాదారుడు మొబైల్ నెంబర్‌తో తన ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే.. 99660-44425, 011-22901406 టోల్ ఫ్రీ నెంబర్‌లకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా కాల్ చేయాలి. ఇక ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ ఇలా చేసుకోవాలి.. 7738299899 నెంబర్‌కు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి. UAN ఉన్న చోట మీ యూఏఎన్ నెంబర్ టైప్ చేయాలి. అనంతరం మెసేజ్ సెండ్ చేయండి.. మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ పూర్తి వివరాలు అందుతాయి.
The process of crediting interest is ongoing and it will get reflected into your account soon. Whenever the interest is credited, it will be paid in full. There will be no loss of interest.
— EPFO (@socialepfo) October 31, 2022