EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. ఫైనల్‌ డేట్ వచ్చేసింది.. రేపు రెడీగా ఉండండి..

పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌లో నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిస్టమ్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా డిజిటల్ సేవలు ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ వర్క్ ఇంకా కొనసాగుతోంది. జూన్ 26 నుంచి సేవలు నిలిచిపోగా.. రేపటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. ఫైనల్‌ డేట్ వచ్చేసింది.. రేపు రెడీగా ఉండండి..
Epfo

Updated on: Jul 02, 2026 | 5:10 PM

పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. పీఎఫ్ ఆన్‌లైన్ సర్వీసులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. జులై 3వ తేదీ నుంచి డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తన ఎక్స్ అకౌంట్‌లో ప్రకటించింది. జూన్ 26వ తేదీ నుంచి పీఎఫ్ ఆన్‌లైన్ సర్వీసులు నిలిచిపోగా.. జులై 1న తిరిగి పున:ప్రారంభం అవుతాయని ఈపీఎఫ్‌వో తొలుత ప్రకటించింది. అయితే టెక్నికల్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో జులై 2కు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ జులై 3 వరకు గడువు పెంచింది. జులై 3వ తేదీన అర్థరాత్రి 12 గంటల నుంచి సేవలు తిరిగి ప్రారంభం అవుతాయంటూ ఓ ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించగా.. రేపటి నుంచి అయినా అందుబాటులోకి వస్తాయేమోనని పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు.

రేపటి నుంచి అందుబాటులోకి..

” సిస్టమ్ అప్‌గ్రేడ్ జరుగుతోంది. మెరుగైన డిజిటల్ ఈపీఎఫ్ఓ ​​అనుభవం కోసం కొద్దిసేపు వేచి ఉండండి. సభ్యులు, యజమానుల సేవలు 3 జూలై 2026న అర్థరాత్రి 12 గంటలకు పునఃప్రారంభమవుతాయి. కలిగిన అసౌకర్యానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము.మీ సహనాన్ని అభినందిస్తున్నాము” అంటూ పేర్కొంది. అయితే నిర్ణీత నిర్వహణ గడువు ముగిసినా గురువారం కూడా ఈపీఎఫ్ఓ పోర్టల్ అందుబాటులో లేకపోవడంతో చాలామంది సభ్యులు, యజమానులు కీలకమైన ఆన్‌లైన్ సేవలను పొందలేకపోయారు. క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడం, డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం పీఎఫ్ సంస్థ తన సిస్టమ్‌లను ఆఫ్‌లైన్‌లోకి తీసుకువెళ్లింది. సేవల పంపిణీని మెరుగుపర్చేందుకు, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించడానికి ఈ మార్పును చేపడుతున్నారు. గడువును పొడిగిస్తుండటంతో.. అప్‌గ్రేడేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

నిలిచిపోయిన ఆన్‌లైన్ సేవలు..

ఈ రాత్రికైనా సేవలు అందుబాటులోకి వస్తాయా.. లేదా అనే దానిపై 7 కోట్ల మంది ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. అయితే జూన్ 26వ తేదీ నుంచి పీఎఫ్ క్లెయిమ్స్ దాఖలు, ఆన్‌లైన్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్, మెంబర్ ఇంటర్‌ఫేస్ లాగిన్, ఎంప్లాయర్ ఇంటర్‌ఫేస్ లాగిన్, పాస్ బుక్ యాక్సెస్, ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR) ఫైలింగ్, కొత్త ఉద్యోగుల కోసం UAN లింకింగ్, EPFO ​​పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న అన్ని డిజిటల్ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ అవుతాయని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. దాదాపు వారం రోజులుగా పీఎఫ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో శుక్రవారం అయినా అందుబాటులోకి వస్తాయా. లేదా మళ్లీ గడువు పొడిగిస్తారా అనేది చూడాలి.

Follow Us