మీరు ఉద్యోగంలో ఉండి పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటే ఈ వార్త మీకోసమే. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. పీఎఫ్ ఖాతాదారుడు పొరపాటున తన అకౌంట్ వివరాలు ఇతరులతో గానీ, సోషల్ మీడియాలో గానీ షేర్ చేయకూడదని ఈపీఎఫ్‌వో హెచ్చరించింది. దీని కారణంగా, ఖాతాదారులు ఆన్‌లైన్ మోసానికి గురవుతారని సూచించింది. ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన సమాచారం సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళితే మీ అకౌంట్‌లో డబ్బులు మాయమవుతాయని హెచ్చరించింది. అయితే ఇది వవకు బ్యాంకు ఖాతాలోనే డబ్బులను మాయం చేసే నేరగాళ్లు.. ఇప్పుడు పీఎఫ్ ఖాతాలపై కూడా కన్నేస్తున్నారని తెలిపింది.
ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు సంబంధించి వివరాలు, ఆధార్, పాన్‌కార్డు, యూఏఎన్ నంబర్, బ్యాంకు వివరాలతో పాటు తదితర వివరాలు ఈపీఎఫ్‌వో ఎప్పుడు కూడా అడగదని, ఒక వేళ ఈ వివరాలు చెప్పాలని మీకు ఫోన్ కాల్ వచ్చినట్లయితే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలాంటి కాల్స్‌ను గానీ ఎప్పుడు స్వీకరించవద్దని, ఒక వేళ స్వీకరించినా ఎలాంటి వివరాలు తెలుపవద్దని సూచించింది. అలాగే మీ మొబైల్‌కు గానీ, మెయిల్‌కు గానీ ఎలాంటి లింక్‌లు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయని, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎవరైనా మిమ్మల్ని ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా అలాంటి సమాచారాన్ని అడిగితే జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సమాచారాన్ని అస్సలు లీక్ చేయవద్దు. అటువంటి మోసానికి సంబంధించిన ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వవద్దు. అలాంటి సందేశాలకు కూడా ప్రత్యుత్తరం కూడా ఇవ్వవద్దు. అలాగే బ్యాంకు వివరాలతో పాటు ఓటీపీలు సైతం షేర్ చేయవద్దని సూచించింది. ఏ సేవ కోసం వాట్సాప్, సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా ఏ మొత్తాన్ని డిపాజిట్ చేయమని ఈపీఎఫ్‌వో ఎప్పుడూ అడగదని తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి