
దేశంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగి జీతం రూ.15 వేలు ఉంటే ఈ పథకంలో తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది. ఇక రూ.15 వేలుపైన జీతం ఉన్నవారు స్వచ్చంధంగా చేరవచ్చు. అలాగే స్వచ్చంధ ప్రావిడెంట్ ఫండ్(VPF) కూడా ఎంచుకునే వెసులుబాటు అనేది ఉంటుంది. అయితే పీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసేందుకు ఈపీఎఫ్ఓ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే ఉమాంగ్ యాప్‌లో కూడా సేవలు పొందవచ్చు. మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ చేయబడ్డా, యూఏఎన్ పాస్ట్ వర్డ్ మర్చిపోయినా, పాస్ బుక్ యాక్సెస్ చేయలేకపోయినా, కేవైసీ పెండింగ్‌లో ఉన్నా లేదా రిజెక్ట్ చేసినా సులువుగా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ అకౌంట్ బ్లాక్ అయితే ఏం చేయాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. పదే పదే లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు విఫలమైతే బ్లాక్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి వెళ్లి సైన్ ఇన్ బటన్ కింద ఉండే అన్ లాక్ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ కనిపించకపోతే పేజీని రిఫ్రెష్ చేయాలి లేదా 30 నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించాలి. ఈ విధానంలో బ్లాక్ అయిన అకౌంట్‌ను తిరిగి యాక్సెస్ చేయవచ్చు. ఇక పీఎఫ్ అకౌంట్ రిస్ట్రిక్టెడ్ అవుతూ ఉంటుంది. అకౌంట్లో ఈ నామినీ వివరాలను అప్డేట్ చేయకపోతే ఇది జరగవచ్చు. నామినేషన్ వివరాలను అప్డేట్ చేయకుండా కనీసం ఐదుసార్లు లాగిన్ అయితే ఇలాంటి సమస్య వస్తుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ హోమ్ పేజీలోని లాగిన్ అయ్యి మేనేజ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ఈనామినేషన్ ఫైల్ చేయండి.
ఇక మీ వివరాల్లో తేడా ఉన్నప్పుడు ఎర్రర్ మెస్సేజ్ వస్తుంది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం వంటి వివరాలు ఆధార్‌తో సరిపోలకపోతే ఈ సమస్య వస్తుంది. ఇలాంటి సమయంలో మీరు క్లెయిమ్ దాఖలు చేయలేరు. ఇందుకోసం మీరు మేనేజ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ‘Modify Basic Details’ ను ఎంచుకోండి. అనంతరం సరైన వివరాలు నమోదు చేసి యజమాని ఆమోదం కోసం వేచి ఉండండి. ఇక మీరు మీ EPF పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయలేకపోయినా లేదా అది లోడ్ కాకపోతే మళ్లీ ప్రయత్నించండి. అధిక ట్రాఫిక్ కారణంగా ఇది జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో మళ్లీ రీఫ్రెష్ చేయండి. లేకపోతే ఉమాంగ్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఇలా ఆన్లైన్ ద్వారా మీరు అన్నీ సేవలు పొందవచ్చు.