EPFO: మీరు ఈపీఎఫ్ ఖాతాదారా.. అయితే ఉమంగ్ యాప్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు.. కానీ..

|

Jan 20, 2022 | 9:16 AM

దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యులను PF ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించింది.

EPFO: మీరు ఈపీఎఫ్ ఖాతాదారా.. అయితే ఉమంగ్ యాప్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు.. కానీ..
Money
Follow us on

దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యులను PF ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించింది. EPFO రెండో వేవ్‌లో రెండుసార్లు నాన్-రీఫండబుల్ అడ్వాన్స్‌ని విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇంతకు ముందు COVID-19 అడ్వాన్స్‌ని పొందిన సభ్యులు ఇప్పుడు రెండో అడ్వాన్స్‌ని కూడా ఎంచుకోవచ్చు. రెండో కోవిడ్-19 అడ్వాన్స్‌ని ఉపసంహరించుకునే విధానం మొదటి అడ్వాన్స్ విషయంలో మాదిరిగానే ఉండనుంది. ఇంట్లో కూర్చుని ఉమంగ్ యాప్ ద్వారా మీరు కొన్ని సెకన్లలో డబ్బు విత్‌డ్రా చేసే ప్రక్రియను పూర్తి చేయవచ్చు . ప్రక్రియ పూర్తయిన తర్వాత, 3 రోజుల్లో మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.

ఎంత అడ్వాన్స్ తీసుకోవచ్చు

నిబంధన ప్రకారం, 3 నెలల బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్ లేదా సభ్యుని EPF ఖాతాలో జమ చేసిన మొత్తంలో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

బ్యాలెన్సు కూడా చూసుకోవచ్చు

పీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్సు చూసుకోవాలంటే పీఎఫ్ సైట్​లోకి వెళ్లి యూఎన్ఏ నెంబర్ ఎంటర్ చేసి పాస్​వర్డ్ టైప్ చేయాలి. ఇదంతా సమయం పడుతుంది. అయితే ఉమంగ్ యాప్​లో యూఎన్​ఏ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రర్ అయిన ఫోన్ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఖాతాదారులు బ్యాలెన్సు చూసుకోవచ్చు.

Read Also… Tax Saving Tips: సెక్షన్ 80C ఉపయోగించకుండా ఆదాయపు పన్ను ఆదా చేయడం ఎలా? ఇందు కోసం 10 చిట్కాలు ఇవే..