Umang
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో బ్యాలెన్స్ మొత్తాన్ని తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆఫ్‌లైన్ ఎస్‌ఎంఎస్ ఆధారిత పద్ధతితో సహా మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయాలనుకుంటే అలా చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి అధికారిక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వెబ్‌సైట్‌ను సందర్శించడం, మరొకటి ఉమాంగ్ యాప్‌ని ఉపయోగించడం. రెండు సందర్భాల్లో మీరు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి, మీరు మీ మొబైల్ నంబర్‌ను ఈపీఎఫ్‌వోలో నమోదు చేసుకోవాలి.
ఉమాంగ్ యాప్‌తో ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి?
- Google Play Store లేదా Apple Play Storeకి వెళ్లి ‘UMANG’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఆ తర్వాత మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- డౌన్‌లోడ్ చేసిన తర్వాత UMANG యాప్‌ను తెరవండి. ఈపీఎఫ్‌వో సేవలను ఉపయోగించడానికి మీరు UMANG యాప్‌లో నమోదు చేసుకోవాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లేదా ‘మై ఐడెంటిటీ’ లేదా డిజిలాకర్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
- రిజిస్ట్రేషన్ తర్వాత యాప్ పైభాగంలో సెర్చ్ బార్ ఉంటుంది. దానిలో ‘సర్వీస్‌ల కోసం సెర్చ్’పై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసి ఈపీఎఫ్వోఅని టైప్ చేయండి.
- ఈపీఎఫ్‌వోకి సంబంధించిన అనేక సేవలు కనిపిస్తాయి.
- ఎవరైనా EPFOని సెర్చ్ చేసినప్పుడు రెండు ఉంటాయి. ఒకటి ‘సర్వీస్’ ఆప్షన్, మరొకటి ‘డిపార్ట్‌మెంట్’ ఎంపిక. ‘సర్వీస్‌లు’ కింద ‘పాస్‌బుక్ కనిపిస్తుంది.అందులోకి వెళ్లండి.
- మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ‘ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీస్’, ‘జనరల్ సర్వీస్’, ‘ఎంప్లాయర్ సెంట్రిక్ సర్వీస్’. మీరు ‘ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీస్’పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఈ కొత్త పేజీ UAN నంబర్‌ని అడుగుతుంది. యూఏఎన్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, ‘లాగిన్’పై క్లిక్ చేయండి.
- తదుపరి దశలో మరొక కొత్త పేజీ తెరవబడుతుంది. అందలో ఈపీఎఫ్‌వోతో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- మీరు ఓటీపీని నమోదు చేసి, ‘యస్’ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, అది మిమ్మల్ని కొత్త పేజీకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు మీ ఈపీఎఫ్ పాస్‌బుక్‌ని వీక్షించవచ్చు. అలాగే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు.
- ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే పాస్‌బుక్ సెర్చ్ చేస్తున్న అదే UANతో మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఇది నమోదు చేయకపోతే ఈ సేవ ఉపయోగించుకోలేరని గుర్తించుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి