
దేశంలోని రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. వందే భారత్ స్లీపర్‌తో పాటు అమృత్ భారత్-II రైళ్లల్లో నియమాలను మార్చింది. టికెట్ల కేటాయింపుల్లో పలు మార్పులకు రైల్వే బోర్డు శ్రీకారం చుట్టిది. ఈ రైళ్లల్లో ఇక నుంచి ఎమర్జెన్సీ కోటాను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో జర్నీ చేసేవారికి ఎమర్జెన్నీ కోటా కింద టికెట్లు లభించనున్నాయి. ప్రత్యేక సమయాల్లో రైల్వే ప్రయాణికులు సీటు, బెర్త్ పొందటం సులభవుతుంది. ఈ మేరకు రైల్వేశాఖ బుధవారం ఉత్పత్తులు జారీ చేసింది. ఈ వివరాలేంటో ఒకసారి చూద్దాం.
-అత్యవసర ప్రయాణం చేసేవారి కోసం రైల్వేశాఖ ఎమర్జెన్సీ కోటా ప్రవేశపెట్టింది
-ఏడు కంటే ఎక్కువ స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉన్న అమృత్ భారత్ -II రైళ్లల్లో 24 బెర్త్‌ల అత్యవసర కోటా ఉంటుంది
-ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌ల్లో వీక్ డేస్‌లో 4 బెర్త్‌లు, వీకెండ్‌లో 6 బెర్త్‌లు అత్యవసర కోటాకు కేటాయించారు
-ఇక వందే భారత్ స్లీపర్ ట్రైన్లల్లో సెకండ్ ఏసీలో వీక్ డేస్‌లో 20 బెర్త్‌లు, వీకెండ్స్‌లో 30 బెర్త్‌లు ఎమర్జెన్సీ కోటాలో ఉంటాయి
-ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో థర్డ్ క్లాస్ ఏసీ కోచుల్లో వీక్ డేస్‌లో 24 బెర్త్‌లు, వీకెండ్‌లో 42 బెర్త్‌లు అత్యవసర కోటాలో కేటాయిస్తారు
-ముందస్తు రిజర్వేషన్ లేదా నో బుకింగ్ తేదీలలో ఏది ముందు వస్తే దాని నుంచి అత్యవసర కోటా అమలు చేస్తారు
-అత్యవసరంగా ఏదైనా ప్రాంతానికి వెళ్లాలనునేవారికి ఇది ఉపయోగపడుతుంది
-పరిస్థితులకు అనుగుణంగా ఈ కోటాను సర్దుబాటు చేస్తామని రైల్వేశాఖ స్పష్టం చేసింది
-జోన్లు, సీట్ల లభ్యతను పరిశీలించిన అనంతరం ఈ కోటా బెర్త్‌లను సర్దుబాటు చేయనున్నారు
-ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి వరకు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ నడుపుతోందిజ. త్వరలో మరిన్ని స్లీపర్ రైళ్లు రానున్నాయి. ప్రస్తుతం 230 స్లీపర్ రైళ్లు తయారీ దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు రైళ్లను విస్తరించున్నారు
-ఇక దేశవ్యాప్తంగా 12 అమృత్ భారత్ సెకండ్ వెర్షన్ రైళ్లు నడుస్తున్నాయి
ఇప్పటివరకు వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ ఉన్నవారికి ప్రత్యేక కోటా కింద సీట్లు కేటాయిస్తున్నారు. ఇప్పుడు అత్యవసర కోటాను కూడా కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లల్లో ప్రవేశపెట్టారు.