Errol Musk: నా రెండో భార్య కుమార్తెతో ఇద్దరు పిల్లల్ని కన్నాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలన్‌ మస్క్‌ తండ్రి!

|

Jul 16, 2022 | 8:47 PM

బిలియనీర్ బిజినెస్‌మెన్‌ ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో భార్య కుమార్తెతో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు మీడియా సమక్షంలో ఎర్రోల్ మస్క్ వెల్లడించాడు. 76 ఏళ్ల ఎర్రోల్ మస్క్ మూడేళ్ల క్రితం (2019) తన 35 ఏళ్ల పెంపుడు..

Errol Musk: నా రెండో భార్య కుమార్తెతో ఇద్దరు పిల్లల్ని కన్నాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలన్‌ మస్క్‌ తండ్రి!
Errol Musk
Follow us on

Who is Elon Musk’s dad, Errol Musk? బిలియనీర్ బిజినెస్‌మెన్‌ ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో భార్య కుమార్తెతో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు మీడియా సమక్షంలో ఎర్రోల్ మస్క్ వెల్లడించాడు. 76 ఏళ్ల ఎర్రోల్ మస్క్ మూడేళ్ల క్రితం (2019) తన 35 ఏళ్ల పెంపుడు కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌తో రెండో సంతానం కలిగినట్టు ఎర్రోల్ యుఎస్ సన్ న్యూస్‌ పేపర్ తెలిపింది. మీడియా కథనాల ప్రకారం.. ఇంజనీర్ అయిన ఎర్రోల్ మస్క్ తర్వాత కాలంలో దక్షినాఫికాలో వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగాడు. ఇతనికి 9 మంది పిల్లలున్నారు. ఎలన్ మస్క్ కు త‌న తండ్రి ఎర్రోల్ మ‌స్క్ అంటే అస్సలు గిట్టదు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్ శారీర‌క సౌఖ్యాలకోసం కోసం ఎంత‌కైనా తెగిస్తాడు. ఎర్రోల్ ఎలన్ మ‌స్క్ త‌ల్లి మేయ‌ల్‌ను మొదటి వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత మేయ‌ల్‌కు విడాకులిచ్చి, పెళ్లై 10 ఏళ్ల కూతురున్నహెడీని రెండో వివాహం చేసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్ధాల త‌ర్వాత రెండో భార్య హెడీకి కూడా విడాకులిచ్చి, వయసులో 40 ఏళ్ల వ్యత్యాసం ఉన్న ఆమె కూతురు (రెండో భార్య కుమార్తె) జానాను వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్, జానా కొంతకాలం కలిసి జీవించారని, వీరిరువురికీ 2017లో అబ్బాయి, 2019 అమ్మాయి పుట్టినట్లు తెలిపాడు. మొత్తం ఎర్రోల్ మస్క్‌కు ఎలన్‌ మస్క్‌తో కలిపి 9 మంది సంతానం. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

మనం భూమిపై ఉండటానికి ఏకైక కారణం పునరుత్పత్తి కోసమే. నా రెండో భార్య కుమార్తెతో నాకున్న సంబంధాన్ని చూసి ఇతర కుమార్తెలు షాక్‌ అవుతున్నారు. నా పిల్లలు ఇప్పటికీ మా ఇద్దరి బంధాన్ని ఇష్టపడట్లేదు. ఎందుకంటే జానా వరుసకు వాళ్లకి సోదరి అవుతుందని ఈ మేరకు ఎర్రోల్‌ మాస్క్‌ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తండ్రి వ్యాఖ్యలపై స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్‌ ఇంతవరకు పెదవివిప్పలేదు. ఎలన్‌ మస్క్‌ 2015లో రాసిన Elon Musk: Tesla, SpaceX, and the Quest for a Fantastic Future బుక్‌లో ఓ విషయాన్ని ఉటంకించాడు. అందేంటంటే.. నా తండ్రైన ఎర్రోల్‌ మంచి వ్యాక్తి కానప్పటికీ అతని గురించి చెడుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. నా చిన్నతనం పీడకలలాంటిది. అతను నా జీవితాన్ని దుర్భరం చేశాడు. ఎంత మంచి విషయాన్నైనా చిటికెలో దాన్ని నాశనం చేయడంలో ఉద్ధండుడు. అతను అంత మంచి వ్యక్తికాదు. నా భార్య విల్సన్‌, పిల్లలను ఎప్పటికీ ఎర్రోల్‌ను కలవనివ్వనని ఎమోషనల్‌గా తెలిపాడు.