AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump-Elon Musk: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర ఆరోపణలు.. కారణం ఇదే!

అయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. ఈ బిల్లుపై మస్క్‌ నిర్ణయం ఏంటో ట్రంప్‌కు తెలిసినా అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారని చెప్పారు..

Trump-Elon Musk: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర ఆరోపణలు.. కారణం ఇదే!
Subhash Goud
|

Updated on: Jun 04, 2025 | 10:16 AM

Share

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య చెడిందనే వార్తలు గుప్పమంటున్నా.. వేళ ఓ బిల్లు విషయమై ట్రంప్‌పై మస్క్‌ విమర్శలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు మిత్రులు కూడా బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌పై ఎలాన్‌ మస్క్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ది ఒన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థకు భారంగా మారుతుందన్న మస్క్.. అమెరికా దివాళా తీయడం ఖాయడం పేర్కొన్నారు. ‘ట్రంప్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’పై మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలో ఇదే బిల్లును విమర్శించారు మస్క్. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ 2.5 ట్రిలియన్‌కు పెంచుతుందని.. అమెరికన్‌ కాంగ్రెస్ దేశాన్ని దివాళా తీసే దిశాగా ప్రయత్నాలు తీసుకుంటుందని ఎలాన్‌ మస్క్‌ ఆరోపించారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలాన్‌ మస్క్‌కు డోజ్‌ నుంచి బయటకు వచ్చారు. అయితే, ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించడమే కాకుండా అధ్యక్షుడిపైనా విమర్శలు గుప్పించారు ఎలాన్‌ మస్క్‌.

అయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. ఈ బిల్లుపై మస్క్‌ నిర్ణయం ఏంటో ట్రంప్‌కు తెలిసినా అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారని చెప్పారు.

ఈ నిధుల బిల్లు ఏమిటి?

ఈ బిల్లు పేరు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్. ఇది ట్రంప్ 2017 పన్ను కోతలను మరింత ముందుకు తెస్తుంది. దీనితో పాటు ఇది సైన్యం, సరిహద్దు భద్రతపై ఖర్చును పెంచుతుంది. ప్రతిగా ఆరోగ్య సేవలు, ఆహార మద్దతు, పేదలకు అందించే ఇతర పథకాలను తగ్గిస్తున్నారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఈ బిల్లు రాబోయే 10 సంవత్సరాలలో అమెరికా అప్పును దాదాపు $3.8 ట్రిలియన్లు పెంచుతుంది.

మస్క్ ఇప్పటికే ట్రంప్ పరిపాలన నుండి నిష్క్రమణ:

ఇదిలా ఉండగా, ఎలోన్ మస్క్ మే 29న ట్రంప్ పరిపాలన నుంచి వైదొలిగారు. ఆయన ప్రభుత్వ సమర్థత శాఖ (DOGE)లో సలహాదారుగా పనిచేశారు. ఈ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తన పదవీకాలం ముగియడానికి ఒక రోజు ముందు తన పదవికి రాజీనామా చేశారు.

CBS న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఖర్చులను తగ్గించుకోవడమే DOGE ఉద్దేశ్యం అని, ఈ బిల్లు దానికి విరుద్ధమని అన్నారు. ఈ బిల్లు సెనేట్‌లో చర్చలో ఉన్న సమయంలో, ట్రంప్ స్వయంగా సెనేటర్లను దీనికి మద్దతు ఇవ్వమని ఒప్పిస్తున్న సమయంలో ఈ వివాదం జరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి