When Is Twitter’s Blue Back: ‘వచ్చే వారంలో ట్విటర్‌ బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ పునరుద్ధరణ’.. వెల్లడించిన మస్క్

|

Nov 13, 2022 | 1:24 PM

ట్విటర్‌ బ్లూటిక్‌ నిలిపివేతపై మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ఎలన్‌ మస్క్‌ ఆదివారం (నవంబర్‌ 13)న స్పందించారు. ట్విట్టర్ బ్లూటిక్‌ వచ్చే వారం చివర్లో తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మస్క్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా..

When Is Twitters Blue Back: వచ్చే వారంలో ట్విటర్‌ బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ పునరుద్ధరణ.. వెల్లడించిన మస్క్
When is twitter Blue Service Back
Follow us on

ట్విటర్‌ బ్లూటిక్‌ నిలిపివేతపై మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ఎలన్‌ మస్క్‌ ఆదివారం (నవంబర్‌ 13)న స్పందించారు. ట్విట్టర్ బ్లూటిక్‌ వచ్చే వారం చివర్లో తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు మస్క్‌ తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపారు. కాగా 8 డాలర్ల ఛార్జితో బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీస్‌ను ప్రకటించిన రెండు రోజుల్లోనే ఫేక్‌ అకౌంట్ల బెడతదో ట్విటర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోనైతే.. పొలిటికల్ లీడర్లు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలను వెరిఫై చేసిన తర్వాత బ్లూమార్క్‌ సదుపాయాన్ని కల్పించేది. కానీ తాజాగా సబ్‌స్క్రఫ్షన్‌ ఆప్షన్‌ ఇవ్వడంతో ఎటువంటి వెరిఫికేషన్‌ లేకుండానే బ్లూమార్క్‌ ఇచ్చింది. ఫలితంగా ట్విటర్‌ ఆదాయం కూడా పెరగసాగింది.

ఐతే అనూహ్యంగా శుక్రవారం నాడు కొందరు యూజర్లకు బ్లూటిక్‌ కనిపించడం ఆగిపోయింది. ఇది తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనని వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సోషల్ నెట్‌వర్క్‌ నుంచి నిషేధించిన విషయం తెలిసిందే. ఐతే ట్రంప్‌ పేరుతో నకిళీ ఖాతాలు బ్లూటిక్‌తో ట్విటర్‌లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే గేమింగ్ ప్లాట్‌ఫాం సూపర్ మారియో, లేకర్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్, జీసస్ క్రైస్ట్ పేర్లతో వెలసిన ఫేక్‌ అకౌంట్లన్నింటికీ బ్లూ వెరిఫికేషన్‌ టిక్‌ వచ్చింది. దీంతో ట్విటర్‌ బ్లూ సర్వీసెస్‌లను, సబ్‌స్క్రిప్షన్‌ను మస్క్‌ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

ఇక గత బుధవారం ఆఫీషియల్‌ లేబుల్‌ను ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ట్విటర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు ట్విటర్ కంపెనీ ఆదాయాలు పాతాలానికి పడిపోతున్నాయి. సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను తిరిగి పునరుద్ధరించకపోతే రాబోయే ఆర్ధిక మాంధ్యాన్న తట్టుకుని నిలబడటం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.