Whatsapp: మస్క్ మావ ఎంత పని చేశావ్.! ఇక వాట్సాప్‌కి ఎండ్‌కార్డేనా..?

వెళ్లగానే వాట్సాప్ చెయ్.. వీలైతే లైవ్ లింక్ షేర్ చెయ్.. తర్వాత వాట్సాప్ గ్రూప్‌ కాల్‌లో మాట్లాడదాం..! పర్సనల్ లైఫైనా, ప్రొఫెషనల్ లైఫైనా.. డేటుడే యాక్టివిటీ మొత్తం ఇలా వాట్సాప్ చుట్టూనే తిరుగుతోంది. ఒక్క అరనిమిషం వాట్సాప్ డౌనైతే చాలు ప్రపంచమే తలకిందులౌతుందా అనేంత భయం. జనజీవితాలతో ఇంతగా పెనవేసుకుపోయిన వాట్సాప్‌కి రేపటిరోజున ఎండ్‌ కార్డ్ పడబోతోందా..?

Whatsapp: మస్క్ మావ ఎంత పని చేశావ్.! ఇక వాట్సాప్‌కి ఎండ్‌కార్డేనా..?
Whatsapp

Updated on: Jun 11, 2025 | 9:06 PM

XChat.. సరికొత్త డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్.. వాట్సాప్‌కు పోటీగా రాబోయే వాట్సాప్‌ లాంటి మరో ఫెసిలిటీ. ఎక్స్‌ పేరుతో షేపు మార్చుకున్న ట్విట్టర్ యాప్‌లో రాబోయే అరుదైన సౌకర్యం. అటు… రాకెట్ బిజినెస్‌లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్న ఎలోన్‌ మస్క్.. దీని మీద సీరియస్‌గా వర్కౌట్ చేశారు. బిట్‌కాయిన్‌ తరహా సెక్యూరిటీ ఇందులో ఉంటుందని భరోసానిస్తున్నారు. ఈవారంలోనే లాంచింగ్ ఉంటుందని సంకేతమిచ్చారు కూడా.

ట్విట్టర్ ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్స్ కొందరు ఇప్పటికే ఎక్స్‌చాట్‌ సర్వీస్‌ను వాడుతున్నట్టు తెలుస్తోంది. ఫీడ్‌బ్యాక్ తీసుకుని, టెక్నికల్ ట్రబుల్స్ ఏమైనా ఉంటే సరిచేసి.. త్వరలో ఎక్స్‌చాట్‌ను జనం ముందు పెట్టాలన్నది మిస్టర్ మస్క్‌ వేసిన మాస్టర్ ప్లాన్. ఎక్స్‌ యాప్‌ను విస్తరించి.. ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చాలన్నది ఎలోన్ మస్క్ గోల్డెన్ డ్రీమ్. ఎక్స్‌చాట్ అనేది ఆ దిశగా మరో ముందడుగు.

ఎండ్‌టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ ఫీచర్‌తో పూర్తి గోప్యంగా ఉండే ఎక్స్‌ చాట్‌లో.. ఇంకా చాలాచాలా పాపులర్ సౌకర్యాలున్నాయి. వద్దనుకోగానే మెసేజెస్‌ మాయమవుతాయి. సరళమైన ఫైల్ షేరింగ్, ఆడియో-వీడియో కాల్స్‌ వాట్సాప్ కంటే మెరుగ్గా ఉండబోతున్నాయి. యూజర్ ప్రైవసీకి, సెక్యూరిటీకి ఏమాత్రం భంగం కలగకుండా.. ఆమాటకొస్తే ఫోన్ నంబరే అవసరం లేకుండా చాట్ సర్వీస్ దొరుకుతోందంటే అంతకంటే ఇంకేం కావాలి..? ఇది కనుక యాక్టివేషన్‌లోకొస్తే ఒక్క వాట్సాపే కాదు.. ఇండియన్ చాట్ వేదిక టెలిగ్రామ్ సైతం తెరమరుగైనా ఆశ్చర్యం లేదంటోంది టెక్‌ సెక్టార్.