న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ ప్రపంచ యువతకు సందేశం ఇచ్చాడు. అతని సందేశంలోని ఓ మాట మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఓ డైలాగ్‌లా ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది. మనం సమాజం నుంచి ఎంత సహకారం తీసుకుంటున్నామో.. అంతకంటే ఎక్కువ తిరిగివ్వాలని సందేశమిచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో ప్రత్యేక సంభాషణలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విద్యార్థులకు పలు సలహాలు ఇచ్చాడు. పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని అన్నారు. సాటి మానవులకు పనికొచ్చే పనులు మాత్రమే చేయాలన్నారు.
నాయకుడిగా ఉండకుండా… సేవకుడిగా ఉండి ప్రజలకు సహాయం చేయండని పిలుపునిచ్చారు. విద్యార్థులు పుస్తక పఠనంపై దృష్టి సారించాలని, సాధారణ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. ఇది మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతుందో వారికి తెలియజేస్తుందని చెప్పారు. జీవితంలో వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి. ప్రపంచంలోని వివిధ రకాల వ్యక్తులను సంప్రదించడం మీ సర్కిల్‌ను విస్తరిస్తుందన్నారు.
ఎలోన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అతని నికర విలువ 270 బిలియన్ డాలర్లు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 114 బిలియన్ డాలర్లు పెరిగింది.
Read Also.. Power Consumption: 2021 డిసెంబర్లో పెరిగిన విద్యుత్ వినియోగం.. 110.34 బిలియన్ యూనిట్ల వాడకం..