EV Bike: ఇది మామూలు ‘మ్యాటర్‌’ కాదు.. ఆ ఈవీ బైక్‌‌పై అదిరే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌ అమాంతం పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఈవీ స్కూటర్లను వాడేందుకు ముందుకు రావడంతో అమ్మకాలు మరింత పెరిగాయి. అయితే ఇటీవల కాలంలో ఈవీ బైక్‌లను కూడా మార్కె్ట్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ప్రముఖ ఈవీ స్టార్టప్‌ కంపెనీ మ్యాటర్‌ తన ఈవీ బైక్‌ అదిరే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

EV Bike: ఇది మామూలు ‘మ్యాటర్‌’ కాదు.. ఆ ఈవీ బైక్‌‌పై అదిరే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌
Matter Aera

Updated on: Jun 07, 2025 | 8:07 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్, మ్యాటర్ తన తొలి ఉత్పత్తి ఏరాపై అద్భుత ప్రయోజనాలను ప్రకటించింది. మ్యాటర్ ఏరా ఈవీ బైక్‌ 5000, 5000+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర రూ.1.74 లక్షలు, రూ.1.84 లక్షలుగా ఉన్నాయి. ‘మిషన్ ఎక్స్చేంజ్ అంటే స్మోక్ టు క్లీన్ ఫ్యూచర్, ఫ్యూయల్ టు ఛార్జ్’ పథకం కింద కస్టమర్లు తమ ప్రస్తుత పెట్రోల్ 2 వీలర్ లేదా 4 వీలర్‌కు ఎక్స్ఛేంజ్ విలువను క్యూఆర్‌ కోడ్ స్కాన్ ద్వారా లేదా సందర్శించడం ద్వారా తక్షణమే తనిఖీ చేయవచ్చని ద్విచక్ర వాహన తయారీదారు పేర్కొన్నారు. అదనంగా మ్యాటర్ 5000పై అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.10,000 విలువైన బీమా, రిజిస్ట్రేషన్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

మిషన్ ఎక్స్చేంజ్ పథకంతో ద్వారా భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సాయం చేయడమే లక్ష్యమని మ్యాటర్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ మోహల్ లాల్బాయ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్కు జీవితకాల బ్యాటరీ వారంటీని ప్రవేశ పెట్టింది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సెగ్మెంట్‌కు మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది. ఇందులో ఎకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్లతో యాడ్‌ చేయబడిన 4-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఈ సెటప్ వైవిధ్యమైన రైడ్ కాంబినేషన్లను అనుమతిస్తుంది. సాధారణంగా సాంప్రదాయ ఈవీలు అందించే దానికంటే ఎక్కువ డైనమిక్ అనుభవాన్ని కోరుకునే రైడర్లను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏరా బైక్‌లు లిక్విడ్-కూల్డ్ పవర్ ట్రెయిన్‌తో వస్తాయి. అందువల్ల వేడి పరిస్థితులలో మోటారు మరియు బ్యాటరీ పనితీరును కొనసాగించడానికి అనుమతిస్తుంది. ఏరా 5 కేడబ్ల్యూహెచ్‌, ఐపీ67-రేటెడ్ బ్యాటరీతో కూడా వస్తుంది. ఇది ఒకే ఛార్జ్ పై 172 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ ఇస్తుంది. ఈ బైక్ 2.8 సెకన్లలోపు 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మ్యాటర్ ఏరాలో నావిగేషన్, మీడియా, కాల్స్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్‌కు మద్దతు ఇచ్చే ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ ఉంది. ఈ బైక్లో హెూమ్ ఛార్జింగ్ కోసం 5 ఎంపీ సాకెట్లకు అనుకూలమైన స్టాండర్డ్ ఆర్బోర్డ్ ఛార్జర్ కూడా ఉంది. రియల్ టైమ్ డేటా యాక్సెస్, రిమోట్ లాకింగ్, జియో-ఫెన్సింగ్, మెయిటెనెన్స్‌ అలెర్ట్స్‌ను అందించే మొబైల్ యాప్ ఈ బైక్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి