EV Trucks: దేశంలో ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రక్కులు.. పూర్తి స్వదేశీ పరికరాలతో తయారీ.. వివరాలు..

|

Apr 05, 2022 | 7:43 PM

EV Trucks: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) అమ్మకాలు గత కొంత కాలంగా గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో పాటు ప్రజా రవాణాలో కూడా ఎలక్ట్రిక్ బస్సులకు(Electric Buses) ఆదరణ పెరిగింది.

EV Trucks: దేశంలో ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రక్కులు.. పూర్తి స్వదేశీ పరికరాలతో తయారీ.. వివరాలు..
Ev Trucks
Follow us on

EV Trucks: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) అమ్మకాలు గత కొంత కాలంగా గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో పాటు ప్రజా రవాణాలో కూడా ఎలక్ట్రిక్ బస్సులకు(Electric Buses) ఆదరణ పెరిగింది. వీటన్నింటి నడుమ ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికాకు చెందిన కంపెనీతో జగకట్టిన గుజరాత్‌ సంస్థ ట్రిటాన్.. దేశంలోనే మొట్టమొదటి ఈ-ట్రక్కును గుజరాత్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం ఈ రోజు గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. కంపెనీ వ్యవస్థాపకులు హిమాన్షు పటేల్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు.

ఈ ట్రక్కు 100% మేడ్ ఇన్ ఇండియా అని హిమాన్షు పటేల్ వివరించారు. దీనికి సంబంధించిన అన్ని విడిభాగాలను దేశీయంగానే తయారు చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం బ్యాటరీలు, సర్క్యూట్‌లు, సెమీకండక్టర్‌లు, కాంపోనెంట్‌లతో సహా 9 కంపెనీల విడిభాగాల తయారీ సంస్థలతో జతకట్టినట్లు వెళ్లడించారు. ఇవన్నీ తమ కంపెనీకి సమీపంలోనే ఉంటాయని పటేల్ వెల్లడించారు. తమ అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం రూ.2500 నుంచి రూ.3000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా వచ్చే సంస్థలు మరో రూ.8000 నుంచి రూ.9000 కోట్ల పెట్టుబడులు పెడతాయని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్లాంట్ లో కొత్తగా 2000 ఉద్యోగాలతో పాటు ఇతర కంపెనీల్లో మరో 3000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

దీపావళి నాటికి ఈ-ట్రక్కులను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే ట్రక్కు నమూనా అమెరికాలో సిద్ధంగా ఉందని తెలిపారు. తొలి దశలో రూ.25,000-30,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ప్రారంభ సంవత్సరాల్లో కంపెనీ పూర్తి దృష్టి భారత మార్కెట్‌పై ఉంచుతామని.. ఆ తర్వాతే ఎగుమతులపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. దీనికోసం హైవేలపై 2 లక్షల EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 15 సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కల్పిస్తామని వెళ్లడించారు. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు.. డ్రైవర్ కు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ గురించి సమాచారం అందే విధంగా దీనిలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో గుజరాత్ ప్లాంట్ నుంచి ఈ-కార్ల ఉత్పత్తిని కాడా ప్రారంభించనున్నట్లు హిమాన్షు పటేల్ తెలిపారు. గుజరాత్‌లోని 600 ఎకరాలకు పైగా స్థలంలో 3 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేశారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

KIA Motors: భారత వాహన ప్రియులకు కియా మోటార్స్ కంపెనీ భారీ షాక్.. ఏమిటంటే..

Rakesh Jhunjhunwala: ఒక్క నెలలో రూ.832 కోట్లు ఆర్జించిన బిగ్ బుల్.. కనక వర్షం కురిపించిన రెండు షేర్లు..