Egg Price: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. కొండెక్కుతున్న కోడిగుడ్డు ధర..

|

Jun 13, 2021 | 2:01 PM

Egg Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. ఈ పాట మనం అందరం ఏన్నో సార్లు వినుంటాం. అయితే.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి అలానే మారింది. కరోనా కాలంలో

Egg Price: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. కొండెక్కుతున్న కోడిగుడ్డు ధర..
Egg Price
Follow us on

Egg Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. ఈ పాట మనం అందరం ఏన్నో సార్లు వినుంటాం. అయితే.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి అలానే మారింది. కరోనా కాలంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువులతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఉప్పు, నూనే, కూరగాయాలు, పప్పు, దినుసులు అన్ని రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో పాటు గుడ్డు ధరలు కూడా కొండెక్కాయి. ప్రస్తుత కరోనా కాలంలో వైద్యులు రోగనిరోధక శక్తి కోసం ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో గుడ్డు తినడం సామాన్యులకు గడ్డు పరిస్థితిగా మారింది. గుడ్లకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీంతోపాటు రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం ఒక గుడ్డు ధర రూ.6 నుంచి రూ.7 గా ఉంది. కోడి గుడ్లకు అమాంతంగా గిరాకీ పెరగడంతో సామాన్యులకు.. అందని ద్రాక్షగా మారుతోంది. అయితే.. కరోనా వచ్చిన గత సంవత్సరంలో కోడి గుడ్డు ధర భారీగా పడి పోయింది. అయితే.. డాక్టర్ల సూచనలతో మళ్లీ గుడ్ల విక్రయాలు భారీగా పెరిగాయి. గతంలో డజన్‌ కోడిగుడ్లు హోల్‌ సెల్‌ ధర 45 నుంచి 50 గా ఉండేది. ఒక్క కోడి గుడ్డు రూ.5లకు లభించేంది. మే చివరి వారం వరకు హోల్‌ సేల్‌ వ్యాపారుల ధర రూ.3.67 లభించింది. ఈ క్రమంలో జూన్‌ నెలలోనే ఒకేసారి రూ.1.57 పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరతో సామాన్యుడు గుడ్లు తేలేసే పరిస్ధితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.

గుడ్ల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. దేశం ఉత్పత్తి చేసే గుడ్లలో ఏపీ వాటా 19 శాతం. గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ముందున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తిలో ఈ రాష్ట్రాల వాటా 60 శాతానకి పైగానే ఉంది. పౌల్ట్రీ సెన్సెస్ ప్రకారం 2019లో ఏపీ ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి.

Also Read;

కాంట్రాక్టర్‌పై వ్యర్థాలు.. చెత్తను తొలగించడం లేదని శివసేన ఎమ్మెల్యే హుకూం.. వీడియో..

Faf du Plessis: ఆసుపత్రిలో సౌతాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్‌.. ఫీల్డింగ్‌లో తలకు గాయం.. వీడియో..