Edible Oil Prices: సామాన్యులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు

|

Jun 04, 2023 | 7:09 PM

మన దేశంలో ఏం వండుకోవాలన్నా వంట నూనె వాడకం తప్పనిసరి. అందుకే వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇటీవల వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా వాటి ధర తగ్గనున్నట్లు తెలిసింది. నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనెల తయారీ పరిశ్రమలను కోరింది. మన..

Edible Oil Prices: సామాన్యులకు గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
Edible Oil Prices
Follow us on

మన దేశంలో ఏం వండుకోవాలన్నా వంట నూనె వాడకం తప్పనిసరి. అందుకే వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇటీవల వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా వాటి ధర తగ్గనున్నట్లు తెలిసింది. నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనెల తయారీ పరిశ్రమలను కోరింది. మన దేశంలో ఏం వండుకోవాలన్నా వంట నూనె వాడకం తప్పనిసరి. అందుకే వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇటీవల వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా వాటి ధర తగ్గనున్నట్లు తెలిసింది. నూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వంట నూనెల తయారీ పరిశ్రమలను కోరింది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు ఆల్రెడీ తగ్గాయి. అయినా దేశీయ పరిశ్రమలు మాత్రం వంటనూనె ధరలు తగ్గించడంలేదు. దాంతో కేంద్రం పభుత్వం రంగంలోకి దిగింది.

ఒక్కో లీటర్‌పై 8 నుంచి 12 రూపాయల వరకూ ధర తగ్గించాలని కేంద్రం కోరింది. జూన్‌ 2న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా నేతృత్వంలో వంటనూనెల పరిశ్రమ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ధరలు తగ్గించాలని కేంద్రం వారికి సూచించింది. డిస్ట్రిబ్యూటర్లు, రీఫైనర్లకు కూడా వంటనూనెల తయారీ సంస్థలు ధరలు తక్షణమే తగ్గించాలని తెలిపింది.

ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లతో నెల రోజుల క్రితం జరిగిన సమావేశంలో డీఎఫ్‌పీడీ ముఖ్యమైన బ్రాండ్స్ శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్, శుద్ధి చేసిన సోయాబీన్ ఆయిల్ పైన లీటరుకు రూ.5 నుంచి రూ.15 తగ్గించే దిశగా సూచనలు చేసింది. ఆవనూనె, ఇతర వంట నూనెలపై కూడా తగ్గించాలని పేర్కొంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం, ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం తగ్గడం వంటి ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి