Edible Oil Prices: వంట నూనెలలు సామాన్యులకు ఊరటనివ్వనున్నాయి. ఇప్పటికే పరుగులు పెట్టిన వంటనూనె ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక తాజాగా దేశంలో వంటనూనె ధరలు మరింత తగ్గనున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. లీటర్ నూనెలపై గరిష్టంగా రూ.15 వరకు తగ్గింపు ఉండే అవకాశాలు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో మరో వారంలో హోల్‌సేల్ మార్కెట్లలో నూనె ధరల తగ్గింపు అమలు కానుంది. పామాయిల్‌పై లీటరుకు రూ.7 నుంచి 8, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై రూ.10 నుంచి 15 వరకు, సోయాబీన్‌పై రూ.5 తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తగ్గింపు హోల్‌సేల్ మార్కెట్లలో అమలకు చర్యలు మొదలయ్యాయని ఆయిల్అసోసియేషన్ పేర్కొంది.
గత నెలలో వంట నూనెలు రికార్డు స్థాయిలో 13.26 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. దీంతో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. భారత్ వినియోగించే వంట నూనెలో సగానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి దిగుమతి సుంకాలు తగ్గించింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో సన్‌ఫ్లవర్, సోయా, పామాయిల్ ధరలు తగ్గాయని ఇండియన్ వెజిటేబుల్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
వినియోగదారులను ఆదుకునేందుకు ప్రభుత్వ అభ్యర్థన మేరకు వంటనూనె MRP (గరిష్ట చిల్లర ధర) తగ్గిస్తున్నట్లు అదానీ విల్మార్ మేనేజింగ్ డైరెక్టర్ అంగ్షు మాలిక్ తెలిపారు. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి తగ్గింపు ఉంటుందని తెలిపారు. పామాయిల్ ఎగుమతి పన్ను విధానంలో ఇటీవల ప్రకటించిన మార్పులను అమలు చేయడానికి ఇండోనేషియా కొత్త నిబంధనలను జారీ చేసింది. ఎగుమతి పరిమితులు ముగిసిన తర్వాత స్లో రిటర్న్ షిప్‌మెంట్‌లను వేగవంతం చేయడానికి గరిష్ట లెవీ రేటు తగ్గింపు ఇందులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి