Business Idea: పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేల సంపాదన పక్కా..

మీ నాలెడ్జ్‌ను పెట్టుబడిగా పెట్టి, ఒక్క పైసా ఖర్చు లేకుండా మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా? ట్యూషన్ చెప్పడం ద్వారా అదనపు సంపాదన సాధ్యమే. ఇది మొదట చిన్నగా ప్రారంభించి, క్రమంగా మీ ఇంటి వద్ద లేదా ఆన్‌లైన్‌లో ట్యూషన్ సెంటర్‌గా మార్చుకోవచ్చు.

Business Idea: పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేల సంపాదన పక్కా..
Gratuity

Updated on: Jan 19, 2026 | 7:30 AM

బిజినెస్‌ చేయాలంటే పెట్టుబడి కావాలి. కానీ అందరి దగ్గర పెట్టుబడికి డబ్బులు ఉండవు కదా. మరి అలాంటప్పుడు వారికి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ ఎలా? దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పైసా పెట్టుబడి లేకుండా మంచి ఇన్‌కమ్‌ పొందవచ్చు. అందుకోసం ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్‌ మీ నాలెడ్జ్‌ను నమ్ముకుంటే చాలు. ముందు మీరు స్టార్ట్‌ చేసి.. ఆ తర్వాత దాన్ని ఒక మంచి బిజినెస్‌గా డెవలప్‌ చేయవచ్చు.

ఇంతకీ మీకు మంచి ఆదాయం ఇచ్చే ఆ ఐడియా ఏంటంటే.. ట్యూషన్‌. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ముగిసి.. పిల్లలంతా మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. ఇక దాదాపు పరీక్షా కాలం మొదలైనట్టే. ఈ టైమ్‌లోనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్యూషన్‌ పెట్టిస్తుంటారు. మీకు ఏదో ఒక సబ్జెక్ట్‌లో నాలెడ్జ్‌ ఉండి, లేదా ప్రైమరీ పిల్లలను హ్యాండిల్‌ చేసేంత నాలెడ్జ్‌ ఉన్నా సరే ట్యూషన్‌ చెబుతూ మంచి ఆదాయం పొందవచ్చు.

ముఖ్యంగా సిటీలో ఒకరిద్దరు పిల్లలకు కూడా వారి పేరెంట్స్‌ సపరేట్‌గా ట్యూషన్‌ పెట్టిస్తుంటారు. పైగా మంచి అమౌంట్‌ కూడా ఇస్తుంటారు. అలాంటి వారికి మీరు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో కూడా ట్యూషన్‌ చెప్పవచ్చు. పైగా దీని కోసం మీరు ఎక్కువ టైమ్‌ వెచ్చించాల్సిన అవసరం లేదు. రోజులో ఒక గంట కేటాయిస్తే చాలు. మీ ఇంటి వద్ద అయినా చెప్పవచ్చు లేదా పిల్లల ఇంటికి అయినా వెళ్లి చెప్పవచ్చు. ఎగ్జామ్స్‌ అయ్యే వరకు చూసి.. మంచిగా అనిపిస్తే.. వచ్చే అకాడమిక్‌ ఇయర్‌ నుంచి బిజినెస్‌లా కన్వర్ట్‌ చేసి మంచి సెంటర్‌లో ట్యూటోరియల్‌ ఓపెన్‌ చేయవచ్చు. మరో ముగ్గురు టీచర్లను హైర్‌ చేసి వారితో ట్యూషన్‌ చెప్పిస్తూ మీరు మంచి ఇన్‌కమ్‌ పొందవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి