
E20 Fuel: ఈ20 పెట్రోల్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఎందుకంటే భారతదేశం 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వైపు అడుగులు వేస్తోంది. 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 30 శాతంకి పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. E20 పెట్రోల్ అంటే పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలిపిన ఇంధనం. ఇది కొత్త వాహనాలకు అనుకూలమైనది. పాత వాహనాలకు కొంత సమస్యలు కలిగించవచ్చు. మైలేజీ విషయానికి వస్తే కొంత తగ్గుదల ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. కానీ అది వాహనం, డ్రైవింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్
E20 పెట్రోల్ అంటే ఏమిటి?
E20 పెట్రోల్ అంటే పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలిపిన ఇంధనం. ఇథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్. దీనిని మొక్కల నుండి ఉత్పత్తి చేస్తారు. ఇది పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా పరిగణించనున్నారు. ఎందుకంటే ఇది గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడంలో సహాయపడుతుంది. అలాగే ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఓరి దేవుడా.. గాలికిపోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదేనేమో.. అసలు ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాంకే
E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ తగ్గుతుందా?
కొంతవరకు తగ్గుదల ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. ఇథనాల్ శక్తి విలువ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది. E20 పెట్రోల్‌తో నడిచే వాహనం తక్కువ మైలేజీని ఇవ్వవచ్చు. అయితే ఈ తగ్గుదల చాలా తక్కువగా ఉండవచ్చు. అలాగే వాహనం రకం, ఇంజిన్ పనితీరు, డ్రైవింగ్ శైలి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని అధ్యయనాలు E20 పెట్రోల్ వాడకం వల్ల మైలేజీలో 1-2% తగ్గుదల ఉంటుందని సూచిస్తున్నాయి. అయితే మరికొన్ని అధ్యయనాలు 3-6% వరకు తగ్గుదల ఉండవచ్చని సూచిస్తున్నాయి.
ఈ20 పెట్రోల్ మైలేజ్‌ను తీవ్రంగా తగ్గిస్తుందని, ముఖ్యంగా కారు వాడకంలో ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్‌కు కూడా హాని చేస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు లేవని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంధన సామర్థ్యంపై ప్రభావం ఉన్నా అది స్వల్పంగా ఉంటుందని చెప్పింది.
ఏమిటీ ఇథనాల్, ఈ10, ఈ20?
E20 పెట్రోల్ వల్ల కలిగే ఇతర ప్రభావాలు:
E20 పెట్రోల్ పర్యావరణానికి, ఇంధన భద్రతకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది పాత వాహనాలకు సమస్యలను కలిగిస్తుంది. మైలేజీలో స్వల్ప తగ్గుదలకు దారితీయవచ్చు. మీరు E20 పెట్రోల్‌ను ఉపయోగించడం ప్రారంభించే ముందు మీ వాహనానికి అనుకూలమైనదా అని తెలుసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: BSNL Best Plan: అతి తక్కువ ధరల్లోనే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి