Gold Street: ఆ వీధి మొత్తం బంగారమే..! ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్‌ స్ట్రీట్.. ఎక్కడంటే..?

దుబాయ్ ప్రభుత్వం ప్రపంచంలోనే తొలి 'గోల్డ్ స్ట్రీట్' ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. డీరా ప్రాంతంలో నిర్మించబడే ఈ నూతన 'దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్'లో వెయ్యికి పైగా బంగారు దుకాణాలుంటాయి. 'హోమ్ ఆఫ్ గోల్డ్'గా పిలువబడే ఈ ప్రాజెక్ట్ దుబాయ్‌ను బంగారం, ఆభరణాల వాణిజ్యానికి అతిపెద్ద అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Gold Street: ఆ వీధి మొత్తం బంగారమే..! ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్‌ స్ట్రీట్.. ఎక్కడంటే..?
Dubai Gold Street

Updated on: Jan 30, 2026 | 7:40 AM

దుబాయ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళికను ప్రకటించింది. ప్రపంచంలోనే ‘మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్’ బంగారు దుకాణాలతో కూడిన వీధిని దుబాయ్‌లో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ దుబాయ్ కోసం కొత్త ‘దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్’లో భాగం. దీనిని ‘హోమ్ ఆఫ్ గోల్డ్’ అని పిలుస్తారు. దుబాయ్‌ను బంగారం, ఆభరణాల వాణిజ్యానికి అతిపెద్ద కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించారు.

1,000 కి పైగా బంగారు దుకాణాలు

ఈ గోల్డ్ స్ట్రీట్ పూర్తిగా బంగారంతో తయారు అవుతుంది. ఇప్పటికే బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన దుబాయ్‌లోని డీరా ప్రాంతంలో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. పర్యాటకులు బంగారం, ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తారు. ఈ కొత్త డిస్ట్రిక్ట్‌లో రిటైల్ దుకాణాలు, హోల్‌సేల్ ట్రెండింగ్, బులియన్ (బంగారు కడ్డీలు), పెట్టుబడి, ఆభరణాలకు సంబంధించిన ప్రతిదీ ఒకే చోట అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కనీసం వెయ్యికి పైగా రిటైల్ బంగారు దుకాణాలు ఉంటాయి. అందువల్ల ఇది పర్యాటకులు, వ్యాపారులకు పెద్ద ఆకర్షణగా ఉంటుంది. దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET), దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) కింద పనిచేసే ఇత్రా దుబాయ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.

ఈ వీధి రూపకల్పన, కచ్చితమైన స్థానం, పూర్తి సమయం పూర్తి వివరాలను దశలవారీగా విడుదల చేస్తారు. ప్రాజెక్ట్ ప్రారంభంలో దుబాయ్ ప్రభుత్వం తన మొదటి వీడియోను విడుదల చేసింది. దుబాయ్ ఎల్లప్పుడూ లగ్జరీ, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. బుర్జ్ ఖలీఫా, పామ్ ఐలాండ్స్, ఇప్పుడు గోల్డ్ స్ట్రీట్ దుబాయ్ గర్వకారణంగా ఉంటాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి