Inherits Property: తాతల ఆస్థి మనవళ్లకు చెందుతుందా? వారే నిజమైన వారసులా? నిబంధనలు తెలిస్తే షాకవుతారు
చాలా మంది ప్రజలు తమ హక్కులను పొందేందుకు సంవత్సరాల తరబడి న్యాయ పోరాటాల్లో ఇరుక్కుపోతుంటారు. వివాదాలను నివారించడానికి, ఆస్తిని త్వరగా, సరిగ్గా విభజించడానికి, ప్రతి వ్యక్తికి అమలులో ఉన్న చట్టాల గురించి వివరమైన జ్ఞానం ఉండాలి. తాతగారి ఆస్తిలో ఎవరికి ఎంత వాటా, ఎప్పుడు, ఎంత వస్తుందో? చాలా మందికి తెలియదు.

భారతదేశంలో ఆస్తి పంపిణీకి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆస్తిపై హక్కులు, దావాలకు సంబంధించిన నియమాల గురించి చాలా మందికి చట్టపరమైన అవగాహన, జ్ఞానం లేదు. ఈ కారణంగా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ప్రజలు తమ హక్కులను పొందేందుకు సంవత్సరాల తరబడి న్యాయ పోరాటాల్లో ఇరుక్కుపోతుంటారు. వివాదాలను నివారించడానికి, ఆస్తిని త్వరగా, సరిగ్గా విభజించడానికి, ప్రతి వ్యక్తికి అమలులో ఉన్న చట్టాల గురించి వివరమైన జ్ఞానం ఉండాలి. తాతగారి ఆస్తిలో ఎవరికి ఎంత వాటా, ఎప్పుడు, ఎంత వస్తుందో? చాలా మందికి తెలియదు. ఈ రోజు మనవాళ్లకి వాళ్ల తాతముత్తాతల భూమి మీదా, ఆస్తి మీదా హక్కు ఉందో లేదో చూద్దాం.
తాత ఆస్తిపై మనవళ్లకే సర్వాధికారం.. కొడుకులు, కూతుళ్లకు కూడా ఆ హక్కు ఉండదు. ఈ మాటలు ఇటీవల కాలంలో చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చట్టం ప్రకారం తాత స్వయంగా సంపాదించిన ఆస్తిపై మనవడికి జన్మహక్కు లేదు. అవును పూర్వీకుల ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉంది. అంటే, అతను పుట్టిన వెంటనే, అతని తాత తన పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిలో అతని వాటా ధ్రువీకరణ అవతుంది. కానీ తాతయ్య చనిపోయిన వెంటనే తన వాటా దక్కదు. తాత స్వయంగా ఆస్తిని కొనుగోలు చేస్తే అతను అలాంటి ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చు. దీన్ని మనవాడు సవాలు చేయలేడు. ఒక వ్యక్తి వీలునామా చేయకుండా మరణిస్తే అతని తక్షణ చట్టపరమైన వారసులు, అంటే అతని భార్య, కుమారుడు, కుమార్తె మాత్రమే అతని స్వీయ-ఆర్జిత ఆస్తిని వారసత్వంగా పొందుతారు. మనవడికి వాటా రాదు. మరణించిన వారి భార్యలు, కుమారులు, కుమార్తెలకు సంక్రమించిన ఆస్తి వారి వ్యక్తిగత ఆస్తిగా పరిగణిస్తారు. ఆ ఆస్తిలో వాటాను పొందే హక్కు మరెవరికీ ఉండదు. తాతయ్య కుమారులు లేదా కుమార్తెలలో ఎవరైనా అతని మరణానికి ముందు మరణిస్తే, మరణించిన కుమారుడు లేదా కుమార్తె చట్టబద్ధమైన వారసుడు మొదటి కుమారుడు లేదా కుమార్తె పొందాల్సిన వాటాను పొందుతాడు.
అందువల్ల ఒక వ్యక్తి తాత చనిపోతే అతని తాత ఆస్తి మొదట అతని తండ్రికి చెందుతుంది. దీని తర్వాత అతను తన తండ్రి నుండి తన వాటాను పొందుతాడు. కానీ ఒక వ్యక్తి తన తాత మరణానికి ముందు తండ్రి చనిపోతే, అతను నేరుగా తన తాత ఆస్తిలో వాటా పొందుతాడు. పూర్వీకుల ఆస్తిలో మనవడికి జన్మహక్కు ఉంది. దీనికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే, అతను సివిల్ కోర్టుకు వెళ్లవచ్చు. తండ్రి లేదా తాత తన పూర్వీకుల నుంచి సంక్రమించిన పూర్వీకుల ఆస్తికి ఎలా అర్హులో అదే విధంగా అతను ఈ ఆస్తికి అర్హులు. కానీ తాతయ్య చనిపోయాక పూర్వీకుల ఆస్తి మనవడికి కాకుండా తండ్రికి చేరుతుంది. అతను తన వాటాను తన తండ్రి నుంచి మాత్రమే పొందుతాడు. తండ్రి తన పూర్వీకుల ఆస్తిలో వాటా ఇవ్వడానికి నిరాకరిస్తే అతను కోర్టును ఆశ్రయించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..